ETV Bharat / bharat

'సమస్యలు కాదు.. లవ్​ జిహాద్​పై దృష్టి పెట్టండి'.. కార్యకర్తలకు భాజపా ఎంపీ సూచన - లవ్​ జిహాద్​పై నళిన్​ కామెంట్స్

మంగళూరు భాజపా ఎంపీ నళిన్​ కుమార్​ కటీల్​ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలు.. రోడ్డు, మురుగునీటి సమస్యలను పట్టించుకోకుండా.. లవ్​ జిహాద్​పై దృష్టి పెట్టాలని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్​ మండిపడింది.

nalin kumar kateel statement about love jihad

author img

By

Published : Jan 4, 2023, 3:43 PM IST

కర్ణాటక భాజపా ఎంపీ నళిన్​ కుమార్​ కటీల్​ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలు.. రోడ్డు, మురుగునీటి సమస్యలను పట్టించుకోకుండా.. లవ్​ జిహాద్​పై దృష్టి పెట్టాలని చెప్పారు. ఇలాంటి చిన్న సమస్యలను పట్టించుకోకూడదని.. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే చిన్నారుల జీవితాన్ని నాశనం చేస్తున్న లవ్​ జిహాద్​కు అడ్డుకట్ట వేస్తామని పేర్కొన్నారు. సోమవారం మంగళూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశం 'బూత్​ విజయ అభియాన'లో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. పాపులర్​ ఫ్రంట్​ ఆఫ్ ఇండియాను నిషేధించకపోతే.. భాజపా నేతలు ప్రాణాలతో ఉండేవారు కాదన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో జాతీయవాదులు లాభపడ్డారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్​ షా నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. పీఎఫ్​ఐను బ్యాన్​ చేయకపోతే.. వరుసగా హిందువుల హత్యలు జరిగేవన్నారు నళిన్ కుమార్.

"2014 నుంచి దేశంలో ఒక్క బాంబు పేలుడు కూడా జరగలేదు. ఇందుకు కారణం కేంద్రంలో అమిత్​ షా, రాష్ట్రంలోని బసవరాజ్​ బొమ్మై ప్రభుత్వం. గోహత్యలపై నిషేధం విధించిన విధంగానే.. లవ్​ జిహాద్​కు వ్యతిరేకంగా మరో చట్టాన్ని తీసుకువస్తాం. ఒకవేళ డీకే శివకుమార్​ ముఖ్యమంత్రి అయితే ఉగ్రవాదులు ఏకంగా వీధుల్లోకే వస్తారు. కాంగ్రెస్​కు ఓటు వేస్తే కుక్కర్ బాంబ్​ నిందితులను విడుదల చేస్తారు. పీఎఫ్​ఐ నిషేధాన్ని ఎత్తివేస్తారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే లవ్​ జిహాద్​ మరింత పెరుగుతుంది. మతమార్పిళ్ల వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకుంటారు. గోహత్యలకు అనుమతిస్తారు. నూతన కర్ణాటక కావాలో..? ఉగ్రవాదులకు అడ్డాగా మారే కర్ణాటక కావాలో..? నిర్ణయించుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉంది."

- నళిన్​ కుమార్​, ఎంపీ మంగళూరు

ఎంపీ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్​
మంగళూరు ఎంపీ నళిన్​ కుమార్​ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్​ కర్ణాటక చీఫ్​ డీకే శివకుమార్​ మండిపడ్డారు. లవ్​ జిహాద్​పై ఆయన చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురిచేయలేదని.. భాజపాకు అభివృద్ధి, నిరుద్యోగంపై ఎప్పుడు దృష్టి పెట్టిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా భాజపా నిజాన్ని ఒప్పుకుందని పేర్కొన్నారు. కర్ణాటక ప్రజలు త్వరలోనే భాజపాకు సరైన గుణపాఠం చెపుతారని తెలిపారు.

ఇవీ చదవండి: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్​తో..!

2013లో తప్పిపోయిన మహిళ.. ఇన్నేళ్లకు భర్త చెంతకు.. ఎలా దొరికిందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.