ETV Bharat / bharat

పాము కాటుతో ఐదేళ్ల చిన్నారి మృతి, తల్లిని కాపాడబోయి - పాము కాటుతో ఐదేళ్ల బాలుడు

Boy Died following Snake Bite: తల్లిని కాపాడబోయి ఐదేళ్ల బాలుడు చనిపోయాడు. తల్లితో వంటగదిలో ఉండగా పాము కాటుకు గురయ్యాడు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో జరిగింది.

Boy Dies Following Snake Bite
Five-year-old boy dies following snake bite in Tamil Nadu
author img

By

Published : Aug 21, 2022, 9:29 AM IST

Updated : Aug 21, 2022, 11:43 AM IST

Boy Died following Snake Bite : తల్లిని కాపాడబోయి ఐదేళ్ల బాలుడు పాము కాటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటన తమిళనాడు తూత్తుకుడి జిల్లాలోని సౌత్​ కుప్పనపురం అనే గ్రామంలో శుక్రవారం జరిగింది.
వివరాల ప్రకారం.. పెరుమాల్​ అనే వ్యక్తి సౌత్​ కుప్పనపురం గ్రామంలో భార్య, ఇద్దరు కుమారులతో నివాసం ఉంటున్నారు. పెద్ద కుమారుడు తల్లితో వంటగదిలో ఉండగా.. గోడ పక్కన ఉన్న రంధ్రంలో నుంచి పాము రావడం గమనించాడు. పాము తన తల్లి వద్దకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. సర్పం ఆ చిన్నారిని కాటు వేసింది. దీంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్రథమ చికిత్స కోసం బాలుడిని కదంబుర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తిరునెల్వేలిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. బాలుడు చనిపోయాడని వైద్యులు నిర్ధరించారు. దీంతో ఆ గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇవీ చదవండి: కాటన్​కు బదులు కండోమ్ కవర్లతో చికిత్స, పీహెచ్​సీ సిబ్బంది నిర్లక్ష్యం

హైవేకు అడ్డంగా రైతు డ్రీమ్​ హౌస్​, కూల్చడం ఇష్టం లేక 500 అడుగులు వెనక్కి

Last Updated : Aug 21, 2022, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.