ETV Bharat / bharat

నీట మునిగి ఐదుగురు చిన్నారులు మృతి- సీఎం సంతాపం, రూ.2లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటన - బిహార్​లో నీట మునిగి ఐదుగురు మృతి

Five Children Drowned In Pond : చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి నీట మునిగి ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. బిహార్​లో జరిగిందీ విషాద ఘటన. మరోవైపు, గుజరాత్​లో పిక్నిక్​కు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు.

కన్నీరుమున్నీరవుతున్న చిన్నారుల కుటుంబసభ్యులు

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 5:19 PM IST

Updated : Nov 13, 2023, 7:07 PM IST

Children Drowned In Pond : బిహార్​లోని కైమూర్ జిల్లాలో నీటి మునిగి ఐదుగురు చిన్నారులు మరణించారు. ధౌపోఖర్​ గ్రామంలో ఈ ఘటన జరిగింది. చిన్నారులు స్నానానికి వెళ్లి చనిపోయి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులను అన్నుప్రియ(12), అన్షు ప్రియ(10), అపూర్వ ప్రియ(9), మధుప్రియ(8), అమన్ కుమార్‌(11)గా గుర్తించారు.

చెరువులో నుంచి చిన్నారుల మృతదేహాలను వెలికితీసి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పిల్లలంతా చెరువులో స్నానం చేస్తుండగా నీట మునిగి చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నట్లు తెలిపారు.

Five children from Bihar's Kaimur meet with watery grave
కన్నీరుమున్నీరవుతున్న చిన్నారుల కుటుంబసభ్యులు

సీఎం సంతాపం.. రూ.2లక్షల ఎక్స్​గ్రేషియా
ఐదుగురు చిన్నారులు నీట మునిగి మృతి చెందిన ఘటనపై బిహార్​ ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్​ స్పందించారు. మరణించిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా ప్రకటించారు.

  • Bihar CM Nitish Kumar expresses condolences over the death of five children who died due to drowning in a pond in Kaimur, three girls and two boys were among those who died. CM also announces an ex-gratia grant of Rs.2 lakh each to the next of kin. pic.twitter.com/4Zhu0vqIpd

    — ANI (@ANI) November 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పిక్నిక్​కు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
దీపావళి పండుగ వేళ.. వనభోజనానికి వెళ్లిన ఇద్దరు యువకులు చనిపోయారు. గుజరాత్​లోని రాజ్​కోట్​లో ఈ ఘటన జరిగింది. రాజ్​కోట్​కు చెందిన నాలుగు కుటుంబాలు.. తమ పిల్లలతో స్థానికంగా ఉన్న డెరోయ్​ గ్రామంలో వనభోజనానికి వెళ్లారు. అందరూ సొరథియా సరస్సు ఒడ్డున అల్పాహారం చేశారు. అనంతరం చేతులు కడుక్కోవడానికి సరస్సు వద్దకు వెళ్లారు.

ఆ సమయంలో​ నీలేశ్​ అనే యువకుడు చేతులు కడుక్కుంటూ ఒక్కసారిగా సరస్సులో మునిగిపోయాడు. వెంటనే అతడిని కాపాడేందుకు దర్శిత్​ అనే యువకుడు నీటిలో దూకాడు. కానీ అతడు కూడా మునిగిపోయాడు. వారిద్దరినీ చూసిన నందన్ సరస్సులోకి దూకి నీలేశ్​, దర్శిత్​ను బయటకు లాక్కొచ్చాడు. అప్పటికే వారిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరూ మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు.

కారు-ట్రక్కు ఢీ, ఐదుగురు మృతి
రాజస్థాన్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పాయారు. భార్మెర్​జిల్లాలో ట్రక్కు, కారు ఢీకొట్టడం వల్ల ఈ ఘటన జరిగింది. మృతులంతా మహారాష్ట్రకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్మెర్​ జిల్లాలో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని భాల్వావ్​కు చెందిన ఓ కుటుంబం.. కారులో జైసల్మేర్​ వెళ్తోంది. ఆ సమయంలో ఒక్కసారిగా వారి కారు, ఎదురుగా వస్తున్న ట్రక్కు పరస్పరం ఢీకొన్నాయి. దీంతో కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు మరణించగా.. మరొకరు గాయపడ్డారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులను ధనరాజ్ (45), స్వరాంజలి (5), ప్రశాంత్ (5), భాగ్యలక్ష్మి (1), గాయత్రి (26)గా గుర్తించారు. శవపరీక్షల కోసం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.

చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబంలో ఐదుగురు దుర్మరణం

రెండు బస్సులు ఢీ- డ్రైవర్లు సహా ఆరుగురు మృతి, రెస్క్యూ చేస్తుండగా కానిస్టేబుల్​ గుండెపోటుతో మరణం

Last Updated : Nov 13, 2023, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.