ETV Bharat / bharat

చేపల వ్యాపారికి జాక్​పాట్​.. అప్పు కట్టాలని నోటీసులిచ్చిన కాసేపటికే రూ.70 లక్షల లాటరీ - లాటరీలో 70 లక్షలు గెలుచుకున్న వ్యాపారి

కేరళలో ఓ చేపల వ్యాపారిని అదృష్టం వరించింది. అప్పు తీర్చాలంటూ బ్యాంకు వారు నోటీసులిచ్చిన గంటల వ్యవధిలోనే లాటరీ రూపంలో రూ.70 లక్షలు గెలుచుకున్నాడు.

fish seller lottery
లాటరీ
author img

By

Published : Oct 14, 2022, 3:54 PM IST

అప్పు తీర్చాలంటూ బ్యాంకు వారు నోటీసులిచ్చిన గంటల వ్యవధిలోనే లాటరీ రూపంలో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. కేరళ కొల్లాం జిల్లాకు చెందిన 40 ఏళ్ల పోఖున్జు రూ.70 లక్షల లాటరీ గెలుచుకున్నాడు. పోఖున్జు ఆర్థిక సమస్యలతో ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి రూ.9 లక్షలు అప్పు తీసుకున్నాడు.

అయితే వడ్డీతో సహా రూ.12 లక్షలయ్యిందని, వెంటనే అప్పు తీర్చకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని బ్యాంకు అధికారుల నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నోటీసు అందింది. ఈ క్రమంలో అతడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అయితే.. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రూ.70 లక్షల లాటరీ గెలుచుకున్నట్లు సమాచారం వచ్చింది. అప్పటి నుంచి పోఖున్జు ఆయన ఆనందానికి అవధుల్లేవు. పోఖున్డు.. చేపల వ్యాపారం చేస్తున్నాడు. ఒక్కసారిగా రూ.70 లక్షల లాటరీ గెలుచుకోవడం వల్ల అతని ఆనందానికి అవధులు లేవు.

ఇవీ చదవండి: జ్ఞానవాపి కేసులో కీలక తీర్పు.. శివలింగం కార్బన్​ డేటింగ్​కు కోర్టు నో!

హిందూ మఠానికి 1600 కిలోల పంట దానం.. ముస్లిం దాతృత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.