ఓ వ్యక్తి కేవలం 15 నిమిషాల్లో 75 చేప ముక్కలను తిన్నాడు. బిహార్‌లోని పట్నాలో నిర్వహించిన చేపలు తినే వినూత్న పోటీలో.. ఫిష్ ముక్కలను అత్యంత వేగంగా ఆరగించాడు. రూ.10 వేల నగదును బహుమతిగా పొందాడు. చేపల విక్రయాలను పోత్సహించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర జాలర్ల సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. చాలా మంది ఔత్సాహికులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.


మదన్ కుమార్ అనే చేపల వ్యాపారి ఇలా 15 నిమిషాల్లో 75 చేప ముక్కలను తిని మొదటి విజేతగా నిలిచారు. పరాస్ అనే వ్యక్తి మొత్తం 73 చేపముక్కలను తిని రెండో స్థానంలో నిలిచాడు. ఇతనికి రూ.5వేల బహుమతి లభించింది. రాజ్‌సాహ్ని, జై కుమార్ ఝా అనే ఇద్దరు వ్యక్తులు.. చేరో 60 చేప ముక్కలు తిని మూడవ స్థానంలో నిలిచారు. వీరికి రూ.2500 బహుమతి లభించింది. "బిహార్, బంగాల్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రల్లో చాలా మంది చేపల పట్టడం, విక్రయించడం వంటి వాటిపైన ఆధారపడ్డారు. మంచి పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చేపలకు.. ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. దీంతో వీటి విక్రయాలు పెంచే లక్ష్యంతోనే ఈ పోటీలు నిర్వహించాం" అని నిర్వహకులు తెలిపారు.