ETV Bharat / bharat

ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. వైద్య దంపతులు సహా ఐదుగురు మృతి - అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి

ఝార్ఖండ్​లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో వైద్య దంపతులతో పాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.

fire accident in hospital
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
author img

By

Published : Jan 28, 2023, 8:07 AM IST

Updated : Jan 28, 2023, 10:52 AM IST

ఝార్ఖండ్​ ధన్​బాద్​లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో వైద్య దంపతులు సహా ఐదుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎనిమిది అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. బ్యాంక్​మోడ్​ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వేకువజామున జరిగిందీ ఘటన.

వికాస్ హజ్రా, ప్రేమ హజ్రా అనే దంపతులిద్దరూ వృత్తిరీత్యా వైద్యులు. వీరు ఆస్పత్రిలోనే నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉన్న స్టోర్ రూమ్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ ఏర్పడింది. ఈ పొగ వల్ల ఊపిరాడక వైద్య దంపతులు సహా వారి మేనల్లుడు, పనిమనిషి, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలో ఉన్న రోగులకు ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్ సంతాపం వ్యక్తం చేశారు.

fire in hospital in dhanbad
మంటలను ఆర్పుతున్న అగ్నిమాపకదళాలు
fire in hospital in dhanbad
ఆస్పత్రిలో చెలరేగిన మంటలు

Last Updated : Jan 28, 2023, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.