హరియాణాలో డీఎస్పీ హత్య జరిగిన రోజే ఝార్ఖండ్‌లో అదే తరహా దారుణం చోటుచేసుకుంది. రాంచీలో నేరస్థులు ఓ మహిళా ఎస్సైని దారుణంగా హత్య చేశారు. వాహనంతో ఢీకొట్టి చంపేశారు.
మృతురాలు సంధ్యా టోప్పో తుపుదానా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి ఓ చెక్‌పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సంధ్య.. దారిలో వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులను పట్టించుకోకుండా నిందితులు.. వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. ఈ క్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యపై నుంచి వాహనం దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను రిమ్స్‌కు తరలించగా.. అక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: లారీతో ఢీకొట్టి డీఎస్పీ దారుణ హత్య.. రిటైర్మెంట్కు ముందే.. మైనింగ్ మాఫియా పనే!