ETV Bharat / bharat

నడిరోడ్డుపై నగ్నంగా మహిళా నర్సు.. ఉద్యోగంలో చేర్చుకోవాలంటూ నిరసన - రాజస్థాన్​లో ఎఎన్​ఎమ్​ నగ్న ప్రదర్శన

రోడ్డుపై ఓ మహిళ నగ్నంగా నిరసన చేపట్టింది. ఉద్యోగం కోసం ఆసుపత్రి ముందు ఆందోళన చేసింది. పోస్టింగ్​ ఇవ్వడంలో.. అధికారులు జాప్యం చేస్తున్నరని ఆవేదన వ్యక్తం చేసింది. రాజస్థాన్​లో ఘటన జరిగింది.

female-anm-naked-protest-in-rajasthan
రాజస్థాన్​లో ఎఎన్​ఎమ్​ నగ్న ప్రదర్శన
author img

By

Published : Feb 22, 2023, 9:31 PM IST

ఉద్యోగం కోసం ఓ మహిళ రోడ్డెక్కింది. నగ్నంగా నిరసన చేపట్టింది. దుస్తులు విప్పేసి అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన చేసింది. నడి రోడ్డుపైనే తన గోడును వెల్లబోసుకుంది. తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ.. కార్యాలయం ముందు ఆందోళనకు దిగింది ఓ మహిళా నర్సు. ఉద్యోగం ఇవ్వడంలో అధికారులు ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు అధికారులకు మొర పెట్టుకున్న తీవ్ర జాప్యం చేస్తున్నారని వాపోయింది. రాజస్థాన్​లో ఘటన జరిగింది.

ఆసుపత్రి ముందు నగ్న ప్రదర్శన..
రాజధాని జైపుర్​లో ఘటన జరిగింది. ఎస్​ఎమ్​ఎస్​ మెడికల్​ కాలేజీ ఎదుట మహిళ నగ్న ప్రదర్శన చేసింది. ఏఎన్​ఎమ్​గా పనిచేస్తున్న.. ఆ మహిళ ఇలా నగ్నంగా నిరసనకు దిగింది. ఈమె అజ్మీర్ జిల్లాలో నివాసం ఉంటోంది. రద్దీగా ఉన్న జేఎల్ఎమ్​ రోడ్డుపై.. ఆసుపత్రికి ముందు బుధవారం ఆమె ఆందోళన చేపట్టింది. ఉదయం 10 గంటలకు ఈ ఘటన జరగింది. ఆ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులంతా ఆ మహిళను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొద్ది సేపటి తర్వాత కొందరు వ్యక్తులు మహిళ గురించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే నర్సు నిరసన చేస్తున్న ప్రదేశానికి చేరుకున్న పోలీసులు.. మహిళను నిలువరించే ప్రయత్నం చేశారు. దుస్తులు వేసుకోవాలని మహిళా కానిస్టేబుళ్లు విజ్ఞప్తి చేశారు. దానికి ఆ మహిళ తిరస్కరించింది. ఎంత చెప్పినా దుస్తులు వేసుకునేందుకు నిరాకరించింది. ఇక చేసేది లేక.. ఆమెపై పోలీసులు దుప్పటి కప్పారు. అనంతరం బలవంతంగా పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లారు.

female-anm-naked-protest-in-rajasthan
నగ్నంగా మహిళ నిరసన

"నేను బేవార్​లో ఉన్న ఆసుపత్రిలో ఏఎన్​ఎమ్​గా పనిచేసేదాన్ని. 2020లో ఆసుపత్రి యాజమాన్యం నన్ను సస్పెండ్​ చేసింది. అనంతరం ఏపీఓగా నియమించింది. కానీ ఇప్పటికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఎన్ని సార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. పోస్టింగ్​ ఇచ్చేందుకు తీవ్ర జాప్యం చేస్తున్నారు. అందుకే ఇలా నిరసన చేపట్టాను" అని నిరసన చేస్తున్న మహిళా నర్సు తెలిపింది. తనకు ఎలాగైన ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంది. "జేఎల్​ఎమ్​ రోడ్డుపై ఓ మహిళ నగ్నంగా ఉందని మాకు సమాచారం అందింది. వెంటనే మహిళ పోలీసులతో అక్కడికి చేరుకున్నాం. మహిళను అదుపులోకి తీసుకున్నాం" అని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.