ETV Bharat / bharat

ఆరు రోజుల పసికందును అమ్మేసిన తండ్రి.. చివరికి!

ఆరు రోజుల పసికందు అని కూడా చూడకుండా.. సొంత కూతురును అమ్మేశాడు ఓ తండ్రి. బిడ్డ పుట్టక ముందే చనిపోయిందని భార్యను నమ్మించాడు. ఇది జరిగిన నాలుగు నెలలకు, దిల్లీ మహిళా కమిషన్​కు సమాచారం అందింది. రంగంలోకి దిగిన అధికారులు.. ఆ పసికందును రక్షించారు. ఈ ఘటన దిల్లీలో జరిగింది.

ఆరు రోజుల పసికందును అమ్మేసిన తండ్రి.. చివరికి!
author img

By

Published : Oct 29, 2021, 10:35 AM IST

దిల్లీ మహిళా కమిషన్​, దిల్లీ పోలీసులు కలిసి ఓ నాలుగు నెలల ఆడబిడ్డను రక్షించారు. ఆ బిడ్డ ఆరు రోజుల వయస్సు ఉన్నప్పుడే తండ్రి అమ్మేయగా.. ఈ నెల 26న పసికందును దిల్లీలోని జహన్​గిర్​పురి ప్రాంతంలో కాపాడారు. నిందితుడిని మాత్రం పోలీసు ఇంకా అరెస్టు చేయలేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇందుకు గల కారణాలు తెలపాలని పోలీసులకు కమిషన్​ లేఖ రాసింది.

ఇలా రక్షించారు..

ఓ తండ్రి పసికందును అమ్మేసినట్టు ఈ నెల 21న దిల్లీలోని షాబాద్ డైరీ​ ప్రాంతంలో.. కమిషన్​కు చెందిన మహిళా పంచాయతీ బృందానికి సమాచారం అందింది. ఈ వ్యవహారంపై డీసీడబ్ల్యూ విజ్ఞప్తితో ఈ నెల 23న పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మధు అనే మహిళను విచారించారు. ఆ శిశువును హరియాణాలోని పానిపట్​లో అమ్మినట్టు ఆమె అంగీకరించింది. ఆ మహిళను తీసుకుని పోలీసులు పానిపట్​కు వెళ్లారు. కానీ శిశువు కనిపించలేదు.

కమిషన్​ దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు పసికందు ఆచూకీని కనుగొంది. జహన్​గిర్​పురి ప్రాంతంలోని ఓ న్యాయవాది ఇంట్లో పసికందు ఉన్నట్టు గుర్తించారు. పానిపట్​కు చెందిన మహేశ్​, మరో మహిళ వద్ద నుంచి శిశువును తీసుకున్నట్టు న్యాయవాది వెల్లడించారు. పసికందును రక్షించిన అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించి వసతి గృహానికి తరలించారు.

Father sold 6-day-old girl
నాలుగు నెలల పసికందు

'ఆరు రోజుల పసికందును ఓ తండ్రి అమ్మేశాడని దిల్లీలోని షాబాద్​ డైరీ ప్రాంతంలోని మహిళా కమిషన్​ పంచాయత్​ బృందానికి సమాచారం అందింది. దిల్లీ పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టాము. విచారణలో భాగంగా.. తన బిడ్డ పుట్టక ముందే మరణించిందని తల్లిని నమ్మించి, ఆ పసికందును తండ్రి అమ్మేశాడని తేలింది. ఇది చాలా దురదృష్టకరం, ఘటనపై ముమ్మర దర్యాప్తు జరపాలి. నిందితుడిని అరెస్ట్​ చేయాలి' అని డీసీడబ్ల్యూ ఛైర్మన్​ స్వాతి మాలివాల్​ డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:- కోర్టులో పాఠం చెప్పిన ధర్మాసనం.. న్యాయమూర్తులే గురువులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.