ETV Bharat / bharat

తండ్రి తనను రేప్ చేశాడని కుమార్తె ఆరోపణలు, ఐదున్నరేళ్ల తర్వాత నిర్దోషిగా

కుమార్తె చేసిన తప్పుడు అత్యాచార ఆరోపణల వల్ల అరెస్టైన ఓ వ్యక్తి ఐదున్నరేళ్ల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్ర అంధేరీలోని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే

maharashtra andheri news
తండ్రిపై రేప్ కేసు
author img

By

Published : Aug 16, 2022, 5:29 PM IST

కుమార్తె చేసిన తప్పుడు ఆరోపణలు ఓ తండ్రిని ఐదున్నరేళ్లపాటు కటకటాల పాల్జేశాయి. తన ప్రేమను అంగీకరించలేదని ఓ బాలిక తండ్రిపై అత్యాచార ఆరోపణలు చేసింది. ఈ కేసులో ఐదున్నర సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించాక నిర్దోషిగా విడుదలయ్యాడు ఆ వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

అసలేమైందంటే
ప్రేమ విషయంలో తండ్రి తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడని బాలిక ఈ దుస్సాహసానికి పాల్పడింది. అంధేరీకి చెందిన బాలిక ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం ఆమె తండ్రికి తెలిసింది. ప్రియుడి కోసం తన కుమార్తె నగలు అలంకరించుకుని వెళ్లడం తండ్రికి నచ్చలేదు. దీంతో ఆమెను హెచ్చరించాడు. అయినా బాలిక.. తన తండ్రి మాటను వినలేదు. కోపంతో తండ్రి ఆమెను కొట్టాడు. ఆ కోపంతోనే బాలిక తండ్రిపై లైంగిక ఆరోపణలు చేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

తన తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని 2017లో పాఠశాల టీచర్​కు బాలిక తప్పుడు సమాచారం ఇచ్చింది. 2016 నుంచి సంవత్సరం వ్యవధిలో నెలకు నాలుగు సార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పింది. అయితే, అవి తప్పుడు ఆరోపణలు అని తెలియని టీచర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వచ్ఛంద సంస్థతో కలిసి.. అంధేరిలోని డీఎన్​ నగర్ పోలీసులకు బాలిక తండ్రిపై కంప్లైంట్ ఇచ్చారు. దీంతో బాలిక తండ్రి 2017లో అరెస్టు అయ్యాడు. అనంతరం బాలిక, టీచర్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు చేసి జువైనల్ హోమ్​కు తరలించారు.

కాగా, పోలీసుల విచారణలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. బాలికపై అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మెడికల్ టెస్టుల్లోనూ రేప్ జరిగినట్లు వెల్లడి కాలేదు. బాలిక మానసిక పరిస్థితి బాగోలేక అలా తప్పుడు ఆరోపణలు చేసిందని పోలీసులు విచారణలో తేలింది. దీంతో బాలిక తండ్రిని కోర్టు నిర్దోషిగా తేల్చింది. అతని విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. 'రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎవరో తనను తాకినట్లు అనిపిస్తోందని, పీడకలలు వస్తున్నాయని బాల్యంలోనే బాలిక తన నోట్​బుక్​లో రాసుకుంది. ఈ నేపథ్యంలో బాలిక మానసిక పరిస్థితి బాగోలేదని తెలుస్తోంద'ని కోర్టు పేర్కొంది.

ఇవీ చదవండి: ఉగ్రవాదుల కిరాతకం, మరో కశ్మీరీ పండిట్ దారుణ హత్య

బిహార్​ మంత్రివర్గ విస్తరణ, తేజ్ ప్రతాప్​కు చోటు, తేజస్వీకి కీలక శాఖలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.