ETV Bharat / bharat

'సాగు చట్టాలు ఇప్పుడే రద్దైనట్టు కాదు.. ఇంకా చాలా ఉంది!' - మోడీ వార్తలు

మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినా(farm laws repeal).. ఈ చట్టాలను ఇప్పటికిప్పుడే ఉపసంహరించుకున్నట్లు కాదు. దీనికి రాజ్యాంగ ప్రక్రియ (farm law repeal process) పూర్తి చేయాల్సి ఉంటుంది. చట్టాల ఉపసంహరణ కోసం బిల్లును (farm laws taken back) పార్లమెంట్​లో ప్రవేశపెట్టి.. ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ఉపసంహరణ బిల్లు చట్టరూపం దాల్చితే.. సాగు చట్టాలపై సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యాలు సైతం నిరూపయోగంగా మారిపోతాయి.

FARM LAWS-REPEAL
FARM LAWS-REPEAL
author img

By

Published : Nov 19, 2021, 4:12 PM IST

కర్షకుల పోరాటం ఫలించింది. కేంద్రం దిగి వచ్చింది. వివాదాస్పద సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్లు (farm laws repeal) స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. అయితే, మోదీ ప్రకటనతో చట్టాలు రద్దు అయినట్లు కాదు. దీనికీ రాజ్యాంగ ప్రక్రియ (farm law repeal process) పాటించాల్సి ఉంటుంది. చట్టాలను ఆమోదించిన తరహాలోనే.. వాటిని ఉపసంహరించేటప్పుడు (farm laws withdrawn) సైతం పార్లమెంట్​లో సంబంధిత ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం చట్టాల ఉపసంహరణ (farm laws taken back) బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టాలి.

"రాజ్యాంగం ప్రకారం చట్టాలను తయారు చేసిన విధంగానే వాటిని రద్దు చేయాల్సిన ప్రక్రియ ఉంటుంది. చట్టాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టాలి. ఈ బిల్లు పాసైతే.. చట్టంగా మారుతుంది. మూడు వ్యవసాయ చట్టాలను అమలు చేయలేదు. కానీ అవి పార్లమెంట్ గడప దాటి రాష్ట్రపతి ఆమోదం పొందిన చట్టాలే. కాబట్టి, వాటిని పార్లమెంట్ మాత్రమే ఉపసంహరించగలదు."

-పీకే మల్హోత్రా, కేంద్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి

ఒకే బిల్లుతో మూడు...

బిల్లు ప్రవేశపెట్టడం మినహా చట్టాలను ఉపసంహరించుకునేందుకు మరో మార్గం లేదని లోక్​సభ మాజీ ప్రధాన కార్యదర్శి పీడీటీ ఆచార్య తెలిపారు. ఒకే ఉపసంహరణ బిల్లుతో మూడు చట్టాలను తొలగించవచ్చని చెప్పారు. చట్టాలను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారనే విషయాన్ని బిల్లులో తెలియజేయాలని వివరించారు.

సుప్రీంలో వ్యాజ్యాలు సైతం చెల్లవు!

సాగు చట్టాల రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో నమోదైన వివిధ పిటిషన్లు సైతం చట్టాల ఉపసంహరణ తర్వాత నిరూపయోగంగా మారిపోనున్నాయి. కేంద్రం ఉపసంహరణ చట్టాన్ని తీసుకొస్తే లేదా ఆర్డినెన్సును జారీ చేస్తే ఇవన్నీ పనికిరాని వ్యాజ్యాలుగా మారిపోతాయని రాజ్యాంగ న్యాయ నిపుణుడు రాకేశ్ ద్వివేది తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపే అవసరం కూడా ఉండదని చెప్పారు. కేసుకు సంబంధించిన న్యాయవాదులు.. చట్టాల రద్దుకు సంబంధించిన వివరాలను ధర్మాసనానికి తెలియజేస్తే.. వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టివేస్తుందని వివరించారు.

మోదీ ప్రకటన

గురునానక్ జయంతి సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు (modi on farm laws) సంచలన ప్రకటన చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో.. ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే చట్టాలను తీసుకొచ్చామని, దేశ ప్రజల కోసం వాటిని ఉపసంహరించుకుంటున్నామని అన్నారు. నిరసన చేస్తున్న రైతులు ఇంటికి వెళ్లిపోవాలని అభ్యర్థించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.