ETV Bharat / bharat

భర్తపై భార్య పోటీ.. అత్తకే కోడలు సపోర్ట్​! - గుజరాత్​లో భార్తపై భార్య పోటీ

గుజరాత్​లోని ఓ నియోజక వర్గంలో భర్తపై భార్య పోటీకి దిగింది. ఆమెకు కోడలు మద్దతు పలికింది. దీంతో డిసెంబర్​ 1న జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు ఉంటారనేది ఆసక్తిగా మారింది.

Family war broke out on Kalol assembly seat

author img

By

Published : Nov 18, 2022, 9:10 PM IST

గుజరాత్​ ఎలక్షన్స్​ సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న వేళ.. ఓ నియోజక వర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్రం​లో త్రిముఖ పోరు ఖాయం అనుకుంటున్నవేళ.. ఓ అసెంబ్లీ స్థానానికి ద్విముఖ పోరు నెలకొంది. భర్తపైనే పోటీకి దిగింది ఓ భార్య. ఆ అత్తకే తన మద్దతు ఇస్తానంది కోడలు. ఇంతకీ విషయం ఏంటంటే..

ప్రభాత్​సింగ్​ చౌహాన్​.. కాంగ్రెస్​ పార్టీ నుంచి 1980, 85లో రెండు సార్లు కలోల్​ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 1995లో భాజపాలోకి చేరి.. అదే నియోజక వర్గం నుంచి భాజపా తరఫున 1995, 1998, 2002 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత పంచమహల్ పార్లమెంట్​ నియోజకవర్గం నుంచి 2009, 2014లో గెలుపొందారు. అయితే తనకు ఇష్టం లేకున్నా పార్టీ అధిష్ఠానం.. 2017లో తన కోడలుకు కలోల్​ అసెంబ్లీ టికెట్​ ఇచ్చింది. దీంతో ఈ సారి తనకు టికెట్​ లభించదన్న కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత గూటికి చేరారు ప్రభాత్​ సింగ్.

దీనిపై ప్రభాత్​సింగ్​ కుటుంబం నుంచి వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. ఈసారి కలోల్​ స్థానంలో మాజీ ఎమ్మెల్యే ఫతేసింగ్​ను పార్టీ బరిలోకి దించుతున్నా.. తాము మాత్రం భాజపాను వదిలి వెళ్లేది లేదని ప్రభాత్​ సింగ్​ భార్య రంగేశ్వరిబెన్ రత్వా వెల్లడించారు. రంగేశ్వరిబెన్​కు ఆమె కోడలు సుమన్​బెన్ చౌహాన్ మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్​ నుంచి కలోల్​ అసెంబ్లీ సీటు ప్రభాత్​ సింగ్​కు దాదాపు ఖాయమైంది. దీంతో పోరు భార్యాభర్తల మధ్య నెలకొంది. తన కుటుంబ సభ్యుల మద్దతు తనకు లేకున్నా ఒరిగేదేమిలేదని అన్నారు ప్రభాత్​ సింగ్​. తనతో కాంగ్రెస్​ కార్యకర్తలు ఉన్నారని.. వారే తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే డిసెంబర్​ 1న జరగనున్న పోలింగ్​లో ప్రజలు ఈ విడిపోయిన కుటుంబంలో ఎవరివైపు ఉంటారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇవీ చదవండి : ఆప్ వర్సెస్ గవర్నర్​.. మరింత ముదిరిన వివాదం.. ప్రభుత్వ కార్యాలయానికి ఎల్‌జీ సీల్‌

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రోబో.. కరపత్రాలు పంచుతూ సందడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.