ETV Bharat / bharat

గూగుల్​ మ్యాప్స్​ను నమ్మి వరదలో చిక్కుకున్న ఫ్యామిలీ.. లక్కీగా... - వరదల్ో చిక్కుపోయిన కారు

గూగుల్​ మ్యాప్స్​లో చూపించిన దారిలో వెళ్లి వరదలో చిక్కుకుపోయింది ఓ కుటుంబం. చివరకు అధికారుల సాయంతో క్షేమంగా బయటపడింది. ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో జరిగింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 30, 2022, 4:19 PM IST

గూగుల్​ మ్యాప్స్​తో గందరగోళం.. వరదలో చిక్కుకున్న కారు

ప్రస్తుత కాలంలో గూగుల్ మ్యాప్స్​ అంటే తెలియని వారెవరూ ఉండరు. ఏ అడ్రస్​ తెలియకపోయినా సరే.. దారిని చూపిస్తూ గమ్యస్థానానికి చేరవేస్తోంది. కానీ ఓ కుటుంబాన్ని మాత్రం చిక్కుల్లో పడేసింది. గూగుల్​ మ్యాప్స్​లో చూపించిన దారిలో వచ్చి వరదల్లో చిక్కుకుపోయింది ఓ కుటుంబం. కారులోని నలుగురు ప్రాణాంతక పరిస్థితిని ఎదుర్కొని, చివరకు అధికారుల సాయంతో క్షేమంగా బయటపడ్డారు.

తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో గత కొన్ని రోజులుగా విపరీతమైన వర్షం కురుస్తోంది. వరదలతో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా హోసుర్​లోని బాగేపల్లి వంతెన మునిగిపోయింది. వంతెనకు ఐదు అడుగుల పైనుంచి వరద ప్రవాహం వెళుతోంది. గూగుల్​ మ్యాప్స్​ను ఉపయోగించి ప్రయాణిస్తున్న ఓ కారు వరద ప్రవాహంలో చిక్కుకుపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నీటిలో చిక్కుకుపోయారు.

family struck in flood water
కారును బయటకు తీస్తున్న సహాయక సిబ్బంది

కర్ణాటకలోని సర్జాపుర్​కు చెందిన రాజేశ్​.. కుటుంబ సమేతంగా హోసుర్​కు వచ్చారు. పనులు ముగించుకుని తమ గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. రోడ్డు పరిస్థితిని పట్టించుకోకుండా గూగుల్​ మ్యాప్ చూస్తూ డ్రైవింగ్ చేస్తూ వెళ్లి వరదలో చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన రాజేశ్​.. పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సత్వరమే స్పందించిన అధికార యంత్రాంగం హుటాహుటిని ఘటనా స్థలానికి చేరుకుంది. భారీ క్రేన్ల సహాయంతో కారును బయటకు తీసి, కుటుంబ సభ్యులను రక్షించారు.

ఇవీ చదవండి: సోనియా గాంధీ పీఏపై రేప్ కేసు, పోలీసులపై నమ్మకం పోయిందన్న బాధితురాలు

ఆస్పత్రికి వెళ్లాక ఓపెన్ కాని అంబులెన్స్​ డోర్​, అరగంట శ్రమించినా నో యూజ్, వృద్ధుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.