Electric Scooter Catch fire: ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగుతున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడు, విల్లుపురమ్ జిల్లాలోని తిండివనమ్లో ఆసుపత్రి ముందు పార్కింగ్ చేసిన ఓ ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగి దగ్ధమైంది. చికిత్స కొసం వచ్చిన దంపతులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఇదీ జరిగింది: తిండివనమ్కు చెందిన జయభారతి అనే వ్యక్తి తన భార్యను చికిత్స నిమిత్తం ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. రోడ్డు పక్కన పార్క్ చేసి ఆసుపత్రి లోపలికి వెళ్లారు. ఆ తర్వాత కొద్ది సమయానికే స్కూటర్లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. మంటల్లో స్కూటర్ పూర్తిగా కాలిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: Prathidhwani: ఎలక్ట్రిక్ బైకులు ఎందుకు పేలుతున్నాయి.. ప్రమాదాలను నివారించడమెలా?