విద్య అనేది అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. నేడు ఆచరించే కార్యక్రమాలే రేపటి భవితను తీర్చిదిద్దుతాయని అభిప్రాయపడ్డారు. 'శిక్షక్ పర్వ్' కాంక్లేవ్‌ను (shikshak parv celebration) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన మోదీ (PM modi news).. సంజ్ఞల డిక్షనరీ (Indian Sign Language Dictionary), టాకింగ్ బుక్స్‌ను ఆవిష్కరించారు. సీబీఎస్ఈ (CBSE) కోసం స్కూల్ క్వాలిటీ అస్యూరెన్స్ మరియు అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేశారు.
"విద్య అనేది సమ్మిళితంగా ఉండటమే కాదు అందరికీ సమానంగా ఉండాలి. టాకింగ్ బుక్స్, ఆడియో బుక్స్ విద్యా వ్యవస్థలో భాగమయ్యాయి. భారతీయ భాషల కోసం సంజ్ఞల డిక్షనరీని తొలిసారి ఏర్పాటు చేసుకున్నాం. విద్యా విధానంలో తొలిసారి భారతీయ సంజ్ఞల భాషను చేర్చాం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఈ సందర్భంగా.. టోక్యో ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులను మోదీ (Modi Olympians) అభినందించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ప్రతి ఒలింపియన్, పారా ఒలింపియన్ 75 పాఠశాలలు సందర్శించాలని సూచించినట్లు చెప్పిన మోదీ.. ఈ అథ్లెట్లతో విద్యార్థులు మమేకం కావాలని కోరారు. విద్యార్థులు క్రీడల్లో రాణించేలా వీరంతా ప్రేరణ కల్పిస్తారని అన్నారు.
ఏంటి ఈ శిక్షక్ పర్వ్?
'శిక్షక్ పర్వ్-2021' కార్యక్రమాన్ని 'క్వాలిటీ అండ్ సస్టేనెబుల్ స్కూల్స్: లెర్నింగ్స్ ఫ్రం స్కూల్స్ ఇన్ ఇండియా' అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. అన్ని స్థాయిల్లో విద్య నిరంతరం కొనసాగేలా చూడడమే కాకుండా నాణ్యతను పెంచేందుకు ఈ కార్యక్రమం తోడ్పడనుంది. మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద పాల్గొన్నారు.
ఇదీ చదవండి: భారత తెల్ల గూఢచారి మైఖేల్ జాన్ కారిట్!