ETV Bharat / bharat

ED Raids on Telangana Medical Colleges : పీజీ సీట్ల బ్లాకింగ్‌ దందాలో.. ఈడీ చేతికి కీలక ఆధారాలు - seat blocking fraud in telangana

ED Raids on Telangana Private Medical colleges : పీజీ మెడికల్ సీట్లు బ్లాక్ చేసి.. వాటిని అక్రమంగా మేనేజ్‌మెంట్ సీట్ల కింద విక్రయించుకుని సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలపై.. ఈడీ మనీలాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణాలోని 12 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు.. వాటికి సంబంధించిన కార్యాలయాలు సహా మొత్తం 16 చోట్ల సోదాలు నిర్వహించింది. రెండు రోజుల పాటు చేసిన సోదాల్లో మల్లారెడ్డి వైద్య కళాశాలలో రూ.1.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కళాశాల బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.89 కోట్లను నిలుపుదల చేసింది. ఇందులో భాగంగా పలు కీలక డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది.

ED Raids on Telangana Medical Colleges
ED Raids on Telangana Medical Colleges
author img

By

Published : Jun 23, 2023, 10:00 AM IST

ED Focus on Telangana Private Medical Colleges : వైద్యవిద్య పీజీ సీట్ల బ్లాకింగ్‌ దందాలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కి కీలక సమాచారం లభించింది. రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఈ దందా జరిగిందనే సమాచారంతో.. రాష్ట్రవ్యాప్తంగా 12 కాలేజీల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌ జిల్లా దక్కన్‌, రంగారెడ్డి జిల్లా పట్నం మహేందర్‌రెడ్డి, మేడ్చల్‌ జిల్లా మల్లారెడ్డి, మెడిసిటీ, కరీంనగర్‌ ప్రతిమ, చలిమెడ, నల్గొండ జిల్లా కామినేని, సంగారెడ్డి జిల్లా ఎంఎన్‌ఆర్, ఖమ్మం జిల్లా మమత, మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్‌వీఎస్ వైద్య కళాశాలల్లో జరిగిన సోదాల్లో పలు పత్రాల్ని, డిజిటల్‌ పరికరాల్ని ఈడీ స్వాధీనం చేసుకుంది.

PG Seats Block in Telangana Medical Colleges : కొందరు వ్యక్తులు, ఏజెన్సీలు.. నీట్ విద్యార్దులతో కలిసి.. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని పీజీ సీట్లను బ్లాక్ చేస్తున్నారని.. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ వరంగల్‌లోని మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు ఆధారంగా.. మరో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తును ప్రారంభించింది. ఈ క్రమంలోనే సీట్లను రద్దు చేసుకున్న ఐదుగురు విద్యార్ధులను ఆరా తీయగా.. వారు అసలు కౌన్సిలింగ్‌కు అప్లై చేయలేదని తేలింది.

ED Focus on Telangana Private Medical Colleges : దర్యాప్తులో భాగంగా నీట్‌లో అత్యధిక మార్కులు సాధించిన వారి వివరాలతో.. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సీటును ఎంచుకున్నట్లు సృష్టించి.. అడ్మిషన్ చివరి రోజు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇలా మిగిలి పోయిన సీట్లను ఇనిస్టిట్యూషనల్ కోటా కింద రూ.కోటి నుంచి రూ.2.5 కోట్లకు విక్రయించినట్లు ఈడీ గుర్తించింది. కానీ మాప్‌-అప్‌ రౌండ్‌ పూర్తయ్యేవరకు సీటు బ్లాక్‌ చేయించి తర్వాత వదులుకుంటే వర్సిటీ అపరాధ రుసుం విధించాలన్న నిబంధన ఉంది.

ED Raids On Telangana Medical Colleges : గతంలో రూ.5 లక్షలుగా ఉన్న అపరాధ రుసుంను.. ఇటీవలే రూ.20 లక్షలకు పెంచారు. దీన్ని విద్యార్థుల తరఫున ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలే చెల్లించినట్లు ఈడీ తాజాగా గుర్తించింది. మరోవైపు బ్లాక్‌ చేసిన సీట్లను విక్రయించడం ద్వారా.. వచ్చిన సొమ్ములో నుంచే ఆ చెల్లింపులు జరిపినట్లు ఆధారాలు సేకరించింది. ఈ వ్యవహారంపై ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ సహా మొత్తం 16 చోట్ల రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించింది.

ED Focus on Private Medical Colleges : సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డివైజ్‌లు, నగదు లావాదేవీలు, పీజీ, ఎంబీబీఎస్‌ విద్యార్ధులు ఫీజుల కట్టిన వివరాలు సేకరించింది. సోదాల్లో భాగంగా మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో రూ.1.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. పీజీ అడ్మిషన్లకు సంబంధించి అనుమానస్పదంగా కనిపించిన మల్లారెడ్డి కళాశాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లోని రూ.2.89 కోట్లను నిలుపుదల చేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని ఈడీ తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.