ETV Bharat / bharat

ఫిట్​నెస్​ కోసం ఆ దుంపలు తిని కానిస్టేబుల్​ అభ్యర్ధి మృతి.. వాట్సాప్​లో మెసేజ్​ చూసి.. - తమిళనాడు తిరుపత్తూర్ న్యూస్

ఫ్లేమ్​ లిల్లీ దుంపలు తింటే దేహదారుఢ్యం పెరుగుతుందని వాట్సాప్​లో చూశారు ఇద్దరు వ్యక్తులు. వాట్సాప్​లో వచ్చిన మెసేజ్​ను నమ్మి లిల్లీ దుంపలను తినేశారు. అస్పస్థతకు గురై.. ఒకరు మరణించగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

Youth dies
యువకుడు మరణం
author img

By

Published : Nov 11, 2022, 10:02 PM IST

తమిళనాడు.. తిరుపత్తూర్​లో దారుణం జరిగింది. ఫ్లేమ్​ లిల్లీ దుంపలు తింటే దేహదారుఢ్యం పెరుగుతుందని వాట్సాప్​లో మెసేజ్​ను చూశారు ఇద్దరు వ్యక్తులు. ఆ మెసేజ్​ను చూసి ఇద్దరూ లిల్లీ దుంపలను తిన్నారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురై ఒకరు మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తిరుపత్తూరులోని మిన్నూరుకు చెందిన లోగనాథన్ (25), సమీప గ్రామానికి చెందిన రత్నం(45) అనే వ్యక్తి ఓ ప్రైవేట్ క్వారీలో కలిసి పనిచేస్తున్నారు. పోలీసు శాఖలో చేరాలనే ఆసక్తి లోగనాథన్​కు ఉంది. అతడు పోలీసు శాఖ నిర్వహించే దేహదారుడ్య పరీక్షల్లో ఉత్తీర్ణుతుడయ్యేందుకు వాట్సాప్​లో వచ్చిన మెసేజ్​ చూసి లిల్లీ దుంపలను తిన్నాడు. అతడితో పాటు పనిచేసే రత్నం కూడా తిన్నాడు. కాసేపటికే వీరిద్దరూ అస్వస్థతకు గురయ్యారు.

Youth dies
లోగనాథన్​

ఇద్దరినీ చికిత్స నిమిత్తం వేలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అప్పటికే లోగనాథన్‌ను పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని రాజీవ్​ గాంధీ ఆస్పత్రికి తరలించమని వైద్యులు సూచించారు. అక్కడ చికిత్స పొందుతూ లోగనాథన్ మృతిచెందాడు. ఈ ఘటనపై అంబూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

పోలీస్ కానిస్టేబుల్ కావాలనే ఆసక్తితో లోగనాథన్ నిత్యం వ్యాయామం చేసేవాడని అతడి బంధువులు తెలిపారు. దేహదారుఢ్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు.. శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకునేందుకు లిల్లీ దుంపలు తినాలని వాట్సాప్​లో మెసేజ్ వచ్చిందని అన్నారు. అందుకే లిల్లీ దుంపలు తిన్నాడని తెలిపారు.

ఇవీ చదవండి: మహిళపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. బైక్​తో ఢీకొట్టి.. దాడి చేసి..

హిమాచల్​ ప్రదేశ్​లో పోలింగ్​కు రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.