ETV Bharat / bharat

పాక్​లోనే దావూద్​ ఇబ్రహీం.. ఈడీ చేతికి కీలక సమాచారం! - కరాచీలో దావూద్​

Dawood Ibrahim in Karachi: అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం ఆచూకీ లభించింది. పాకిస్థాన్​లోని కరాచీలోనే ఉన్నట్లు దావూద్​ మేనల్లుడు చెప్పాడని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో దావూద్​ అంశాన్ని కేంద్రం సీరియస్​గా తీసుకుని చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్​ వాల్సే.

Don Dawood Ibrahim i
దావూద్​ ఇబ్రహీం
author img

By

Published : May 24, 2022, 2:18 PM IST

Dawood Ibrahim in Karachi: కీలక కేసుల్లో నిందితుడు, అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం పాకిస్థాన్​లోనే ఉన్నాడంటూ పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ కీలక సమాచారం రాబట్టింది. దావూద్​ కరాచీలోనే ఉన్నట్లు ఈడీకి అతడి సోదరి హసీనా పార్కర్​ కుమారుడు అలిశా పార్కర్​ తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఓ మనీలాండరింగ్ కేసులో విచారణ సందర్భంగా కీలక సమాచారాన్ని అలిశా పార్కర్​ ఈడీకి అందించినట్లు పేర్కొన్నాయి.

మనీలాండరింగ్​ కేసులో విచారణకు హాజరుకావాలని అలిశా పార్కర్​కు పలుమార్లు సమన్లు జారీ చేసింది ఈడీ. ఈ క్రమంలోనే అదుపులోకి తీసుకుని విచారించగా.. దావూద్​ కరాచీలోనే ఉన్నట్లు అతడు తెలిపాడు. అలిశా పార్కర్​ వాంగ్మూలం నమోదు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. " నేను పుట్టక ముందే దావూద్​ ముంబయి వదిలి వెళ్లాడు. దావూద్​ మా మామ. 1986 వరకు దంబర్వాలా భవన్​లో నివసించాడు. దావూద్​ ఇబ్రహీం పాకిస్థాన్​లో ఉన్నట్లు చాలా మంది మా బంధువుల ద్వారా తెలిసింది. వాళ్లు భారత్​ను విడిచివెళ్లినప్పుడు నేను ఇంకా పుట్టనేలేదు. వారితో నేను, నా కుటుంబం కాంటాక్ట్​లో లేము. కానీ, కొన్నిసార్లు ఈద్​, ఇతర పండుగలకు మా మామ దావూద్ భార్య మెహ్జబీన్​.. నా భార్య ఆయేషా, నా సోదరినులతో మాట్లాడినట్లు తెలుసు." అని అలిశా పార్కర్ చెప్పినట్లు పేర్కొన్నాయి.

కేంద్రం చర్యలు తీసుకోవాలి: అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీంను పట్టుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్​ వాల్సే. ఇన్నాళ్లు ఆచూకీ తెలియదని, ఇప్పుడు తెలిసిన క్రమంలో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్​గా తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: అండర్​వరల్డ్​ డాన్​ 'దావూద్'​ గ్యాంగ్​లో ఇద్దరు అరెస్ట్​.. చోటా షకీల్​తో!

దావూద్​ కేసులో వారికి ఎన్​ఐఏ ఉచ్చు.. 20 చోట్ల సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.