ETV Bharat / bharat

వెజ్​కు బదులు నాన్​ వెజ్ పిజ్జా డెలివరీ.. కస్టమర్​కు అస్వస్థత.. డామినోస్​కు భారీ ఫైన్ - మాంసాహార పిజ్జా

Dominos Pizza Fined: పిజ్జా డెలివరీలో పొరపాటుతో డామినోస్​ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. శాకాహార పిజ్జా ఆర్డర్​ చేస్తే.. నాన్​ వెజ్ పిజ్జా తెచ్చారని వినియోగదారుడు ఫిర్యాదు చేశారు. రూ. 9 లక్షలు పరిహారం చెల్లించాలని డామినోస్​ను ఆదేశించింది వినియోగదారుల కమిషన్​.

Domino's fined more than 9 lakhs for delivering non-veg pizza instead of veg to the customer

author img

By

Published : May 13, 2022, 12:46 PM IST

Dominos Pizza Fined: వెజ్​ పిజ్జా ఆర్డర్​ చేస్తే.. మాంసాహార పిజ్జాను డెలివరీ చేశారని ప్రముఖ రెస్టారెంట్​ కంపెనీ డామినోస్​పై కేసు వేశాడు ఉత్తరాఖండ్​ రూడ్కీకి చెందిన ఓ వ్యక్తి. పోలీస్​ స్టేషన్​లో న్యాయం జరగకపోగా.. జిల్లా వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించాడు. బాధితుడికి.. రూ. 9 లక్షల 65 వేల 918 పరిహారంగా చెల్లించాలని డామినోస్​ను ఆదేశించింది.

ఇదీ జరిగింది: రూడ్కీలోని సాకేత్​ ప్రాంత నివాసి శివాంగ్​ మిత్తల్​.. 2020 అక్టోబర్​ 26న రాత్రి ఆన్​లైన్​లో పిజ్జా టాకో(వెజ్​ పిజ్జా), చాకో లావా కేక్​ ఆర్డర్​ చేశాడు. దీని విలువ రూ. 918. ప్యాకెట్​ను విప్పి చూడగా.. మాంసాహార పిజ్జా అని తెలిసింది. దీంతో అతడు వాంతులు చేసుకున్నాడు. ఆరోగ్యం కూడా క్షీణించింది. వినియోగదారుడు, అతడి కుటుంబం మొత్తం శాకాహారులు.

మాంసాహార పిజ్జాతో.. తమ మతపర మనోభావాలు దెబ్బతిన్నట్లు స్థానిక గంగ్​నహర్ రూడ్కీ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు బాధితుడు. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. జిల్లా వినియోగదారుల కమిషన్​ తలుపు తట్టాడు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. దీనిలో డామినోస్​ కంపెనీ నిర్లక్ష్యాన్ని గుర్తించింది. శాకాహార పిజ్జా ఆర్డర్​ చేశాక కూడా.. మాంసాహార పిజ్జా పంపినందున వినియోగదారులకు సరైన సేవలు అందించట్లేదని మండిపడింది.
సదరు బాధితుడు పిజ్జాకు పెట్టిన రూ. 918 ఖర్చుకు 6 శాతం వార్షిక వడ్డీ సహా ఆర్థిక పరిహారంగా రూ.4.5 లక్షలు, ఇతర పరిహారంగా రూ. 5 లక్షలు మొత్తం రూ.9,65,918 నెలలోగా చెల్లించాలని ఆదేశించింది.

ఇవీ చూడండి: ఆన్​లైన్​లో పిజ్జా ఆర్డర్ చేస్తే.. రూ.11 లక్షలు హాంఫట్!

ఆన్​లైన్​లో 'చికెన్ టిక్కా పిజ్జా' ఆర్డర్- 2 ముక్కలు తిన్న క్షణాల్లోనే గుండె ఆగి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.