ETV Bharat / bharat

దీపావళి గిఫ్ట్ - ఇలా ప్లాన్ చేస్తే అదుర్స్! - దీపావళి పండగకు కుటుంబ సభ్యులకు బహుమతులు

Diwali Gift Ideas 2023 for Family and Friends : దీపావళి వెలుగులతో మన ఇళ్లే కాదు.. మనకు ఇష్టమైన వారి కళ్లు కూడా మెరిసిపోవాలి. అప్పుడే.. అసలైన సెలబ్రేషన్స్ జరిగినట్టు లెక్క. ఇందుకోసం ఉన్న బెస్ట్​ ఆప్షన్స్​లో ఒకటి.. "గిఫ్ట్​". మరి.. ఈ దివాళీకి మీ ప్రియమైన వారికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో ప్లాన్ చేశారా..?

Diwali Gifts For Friends And Family Members
Diwali Gifts For Friends
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 2:38 PM IST

Diwali Gift Ideas 2023 for Family and Friends : దీపావళి పండగ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది.. దీపపు కాంతుల్లో వెలిగిపోతున్న ఇల్లు. ఆ ఇంటి ముందు మోగుతున్న టాపాసుల మోతలు. ఇంకా నోరు తీపి చేసే మిఠాయిలు.. ప్రియమైన వారు ఇచ్చే బహుమతులు. మరి.. ఈ ఏడాది కూడా దీపావళి వచ్చేస్తోంది. ఈ పండగ సందర్భంగా మీ ప్రియమైన వారికి ఎలాంటి బహుమతి అందించబోతున్నారు? ఇంకా.. ఎలాంటి ఆలోచనా చేయలేదా? అయితే.. మీకోసమే ఈ స్టోరీ. ఎలాంటి గిఫ్ట్‌ ఇచ్చి.. మీ వాళ్లను సర్‌ప్రైజ్‌ చేయొచ్చో ఓసారి చూడండి.

షాపింగ్ : పండగపూట మంచి డ్రెస్ వేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? మరీ ముఖ్యంగా.. మహిళలు, యూత్​ ఫస్ట్ ప్లేస్​లో ఉంటారీ విషయంలో! అందుకే.. ఈ దివాళీకి మీరు షాపింగ్ చేయండి. మీకోసం ఏం కొనుగోలు చేస్తారో అది మీ ఇష్టంకానీ.. మీకు ప్రియమైన వారికోసం మాత్రం శ్రద్ధగా షాపింగ్ చేయండి. వారి ఇష్టాలేంటో మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి.. వారికి నచ్చే, సూటయ్యే డ్రెస్ కొనేయండి. కానీ.. మీ షాపింగ్ విషయం మాత్రం వారికి తెలియనివ్వకండి. పండగ దాకా సీక్రసీ మెయింటెయిన్ చేసి.. దివాళీ వెలుగుల్లో వారికి ప్రజెంట్ చేయండి. అప్పుడు.. మతాబుల్లా వెలిగిపోయే వారి కళ్లను.. అలా చూస్తూ ఉండిపోండి. ఇంతకన్నా ప్రియమైన క్షణాలు ఏముంటాయి చెప్పండి..?

ఫొటో : మీకు ఇష్టమైన వారికి ఇచ్చే.. ఇష్టమైన బహుమతుల్లో ఫొటో కూడా చాలా వాల్యుబుల్ గిఫ్ట్. మీ ఫోన్ గ్యాలరీలో చూడండి.. ఒకానొక టైమ్​లో తీసిన ఓ సూపర్ Unexpected Pic ఉండే ఉంటుంది. దాని గురించి అందరూ మరిచిపోయే ఉంటారు. ఇప్పుడు మీరు దాన్ని బయటకు తీయండి. 20 X 16 సైజులో.. అద్దిరిపోయే ఫ్రేమ్ డిజైన్​ చేసి.. సూపర్ గిఫ్ట్​ ప్యాక్ లాగా రెడీ చేసి ఇవ్వండి. దాన్ని ఓపెన్ చేస్తున్నప్పుడు.. ఓపెన్ చేసిన తర్వాతా వారి ముఖంలోని ఆనందాన్ని చూడండి. ఇలాంటి సంతోషం ఎక్కడ దొరుకుతుంది?

టపాసులు : దీపావళి పండుగ అంటేనే టాపాసుల మోత. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇందులో భాగమవుతారు. అయితే.. పిల్లలు మరింత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారని మనకు తెలిసిందే. అందుకే.. పిల్లల కోసం టపాసులు మోసుకెళ్లండి. రెగ్యులర్​ లభించేవాటికన్నా.. వారు ఎన్నడూ చూడని, పేల్చని టపాసులైతే.. వారు మరింతగా ఉప్పొంగి పోతారు. ఆనందంతో కేరింతలు కొడతారు. అలాంటివి చూసి సెలక్ట్ చేయండి.

హోమ్‌ ప్రొడక్ట్ : అమ్మ లేదా నాన్న.. చాలా కాలంగా తెచ్చుకోవాలని అనుకుంటున్న వస్తువు ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. అది మీ వల్ల అయ్యే అవకాశం ఉంటే మాత్రం.. దాన్ని ఈ పండగవేళ అస్సలు మిస్ చేయొద్దు. దాన్ని భద్రంగా ప్యాక్ చేయించి.. పండగవేళ వారి చేతికి అందించండి. చిన్ననాటి నుంచి మీకోసం ఎన్నో చేసి ఉంటారు. మీ కళ్లలో ఎన్నోసార్లు ఆనందం చూసి ఉంటారు. ఫర్​ ఏ ఛేంజ్.. ఇప్పుడు ఆ బాధ్యత మీరు తీసుకోండి.

మేకప్ కిట్ : మీ ప్రియమైన వారిలో అమ్మాయిలు ఉంటే.. వారిని సర్​ ప్రైజ్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అయితే.. వారు అందానికి ప్రాముఖ్యత ఇచ్చేవారైతే.. తప్పకుండా వారికి మేకప్ కిట్ ఇవ్వడం సూపర్ గిఫ్ట్ అవుతుంది. ఈ దివాళీకి వారి చేతిలో మేకప్ కిట్ పెట్టండి. దీపాల వెలుగుల్లో వారు మరింత మెరిసిపోవడం ఖాయం.

అభరణాలు : ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న పనే అయినప్పటికీ.. మెజారీ మహిళలు బంగారు ఆభరణాలపై మనసు పారేసుకుంటారు. అంతేకాకుండా.. దీపావళి పండగ రోజున బంగారు, వెండి వంటి అభరణాలు కొనుగోలు చేయడం మంచిదని విశ్వసిస్తారు. దీనివల్ల లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే.. మీకు వీలైతే వారు మెచ్చే, నచ్చే ఆభరణాన్ని బహుమతిగా ఇవ్వండి. ఆనంద లక్ష్మి వారి ముఖంలో తాండవం చేస్తుందంతే!

మిఠాయిలు : ఇది రెగ్యులర్ గిఫ్ట్ ప్యాకే కదా అని తీసి పారేయకండి. ఈ పండగవేళ మీ వాళ్లతో సరికొత్త మిఠాయిలను రుచి చూపించండి. ఎల్లప్పుడూ తీసుకునేవి కాకుండా.. వాళ్లు ఇప్పటి వరకూ టేస్ట్ చేయని ఐటమ్స్ మీ గిఫ్ట్ ప్యాక్​లో ఉండేలా చూసుకోండి. ఇలా.. ఏదో ఒక బహుమతి అందివ్వడం ద్వారా.. మీకు ఇష్టమైన వారిని ఈ పండగ వేళ మరింత ఆనందంగా ఉంచండి.

ఆ గ్రామాల్లో దీపావళి రోజు నో సెలబ్రేషన్స్​- విదేశాల్లో ఉన్న వారు కూడా! 200 ఏళ్లుగా

Festivals in November 2023 : అట్లతద్ది నుంచి.. దీపావళి దాకా.. నవంబరులో ఎన్ని పండగలు, వ్రతాలు ఉన్నాయో తెలుసా..?

దీపావళి ఆఫర్ - హీరో బైక్‌, స్కూటీలపై భారీ తగ్గింపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.