ETV Bharat / bharat

యువతకు మోదీ 'దీపావళి' గిఫ్ట్.. 75వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు - ప్రధాని మోదీ దీపావళి కానుక

దేశవ్యాప్తంగా 10లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఇటీవల హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. పలు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీ చేపట్టి 75వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించారు. వారికి ప్రధాని స్వయంగా నియామక పత్రాలు అందజేయనున్నారు.

PM Modi
ప్రధాని నరేంద్ర మోదీ
author img

By

Published : Oct 20, 2022, 2:21 PM IST

దేశవ్యాప్తంగా వేలాది మంది యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి కానుకలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ శనివారం (అక్టోబరు 22) ప్రధాని మోదీ 75వేల మంది యువతతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పలు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలకు ఎంపికైన యువతకు ఈ అపాయింట్‌మెంట్‌ లెటర్లను అందించనున్నారని తెలుస్తోంది.

రక్షణ, రైల్వే, హోం, కార్మిక-ఉపాధి శాఖలు, తపాలా శాఖ, సీఐఎస్‌ఎఫ్‌, సీబీఐ, కస్టమ్స్‌, బ్యాంకింగ్‌ తదితర రంగాల్లో ఉద్యోగాలకు ఎంపికైన యువతతో మోదీ ముచ్చటించనున్నారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు, భాజపా ఎంపీలు కూడా పాల్గొననున్నారు. విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌.. ఒడిశా నుంచి, ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ.. గుజరాత్‌ నుంచి, సమాచార-ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. చండీగఢ్‌ నుంచి, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌.. మహారాష్ట్ర నుంచి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. తమిళనాడు నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.

దేశంలో నిరుద్యోగంపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రానున్న 18 నెలల్లో 10లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే పలు ప్రభుత్వ విభాగాల్లో ఇటీవల ఉద్యోగాల భర్తీ చేపట్టారు.

ఇవీ చదవండి: భుజంపై చిన్నారి మృతదేహం.. అంబులెన్సు లేక బస్సులో ఇంటికి ప్రయాణం

భర్త ఈఎంఐలో మొబైల్ కొన్నాడని.. విషం తాగిన భార్య.. చివరికి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.