BMW Car Cauvery River: కర్ణాటక మండ్య జిల్లాలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. శ్రీరంగపట్నం నిమిషాంబ ఆలయం సమీపంలోని కావేరీ నదిలో విలాసవంతమైన బీఎండబ్ల్యూ కారు లభ్యమైంది. గురువారం ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వాహనాన్ని వెలికితీసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం తెలిసింది. బెంగళూరు మహాలక్ష్మీ లేఅవుట్ ప్రాంతంలో నివసించే రూపేశ్‌కు చెందిన కారుగా గుర్తించారు. అతడే డిప్రెషన్‌కు లోనై కారును నదిలో పడేసినట్లు తెలుసుకొని షాకయ్యారు.
![Depressed man sinks BMW car in Cauvery river at karnataka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mnd-27-01-carinriver_27052022153411_2705f_1653645851_1074_2705newsroom_1653651345_403.jpg)
ఇవీ చూడండి: దిల్లీ అల్లర్ల నిందితుడికి ఘనస్వాగతం.. భారీగా తరలివచ్చిన జనం.. 4 గంటల పెరోల్కే!