Lab grown diamond: గుజరాత్ సూరత్‌లోని ప్రయోగశాలలో తయారవుతున్న వజ్రాలకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. అసలైన వజ్రాలకు దీటుగా ఇవి పోటీ పడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. వీటిని చూసినవారు కచ్చితంగా 'వావ్' అనకుండా ఉండలేరు. ఇంతకీ ఈ కృత్రిమ వజ్రాల ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం.
Diamond Embedded Accessories: ఖరీదైన వస్తువులు కొనేవారు వాటికి యాక్సెసరీస్ కూడా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే ధర గురించి ఆలోచించరు. ఇలాంటి కస్టమర్లనే దృష్టిలో ఉంచుకుని సూరత్ వ్యాపారులు కృత్రిమ వజ్రాలతో అద్భుతమైన యాక్సెసరీస్ తయారు చేస్తున్నారు. నిజమైన వజ్రాలు అలంకరించినట్లు ఇవి మిలమిల మెరిసిపోతుంటాయి.
మొబైల్ కవర్లు, సన్ గ్లాసెస్, బెల్టు బకెల్స్, స్మార్ట్ వాచ్‌లు, సాధారణ వాచ్‌లు, తాళాలు వంటి వాటిని ల్యాబ్‌లో తయారైన వజ్రాలతో మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. కార్ల బ్రాండు లోగోలు, చైన్లు, బ్రేస్లెట్లను కూడా కృత్రిమ వజ్రాలతో అలంకరిస్తున్నారు. ఒరిజినల్ వజ్రాలతో పోల్చితే కృత్రిమ వజ్రాల ధర చాలా తక్కువే అయినప్పటికీ.. వీటిని అలంకరించిన యాక్సెసరీస్ ధర మాత్రం భారీగానే ఉంటుంది. రూ.7లక్షలు ఖరీదైన వాచ్‌ను కృత్రిమ వజ్రాలతో అలంకరిస్తే దాని ధర రూ.14లక్షలు అవుతుంది.
అలాగే ఐఫోన్ వంటి ప్రీమియం మొబైళ్ల కవర్లను రూ.2.5లక్షలకు విక్రయిస్తున్నారు సూరత్ వజ్రాల వ్యాపారులు. మేలిమి బంగారంతో పాటు వందల సంఖ్యలో కృత్రిమ వజ్రాలను ఉపయోగించడం వల్లే ఈ యాక్సెసరీస్‌కు అంత ఎక్కువ ధర అని చెబుతున్నారు. వీటి డిజైన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే భారత్‌తో పాటు అమెరికా వంటి విదేశాల్లోనూ వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఖర్చు గురించి ఏమాత్రం ఆలోచించని వారు వీటి కోసం ఆర్డర్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 130ఏళ్ల చెట్టుపై 'మెర్క్యూరీ' దాడి.. నలుగురు డాక్టర్ల స్పెషల్ ట్రీట్మెంట్తో...