ETV Bharat / bharat

'ఆసియాలోని టాప్​ 10 కాలుష్య నగరాల్లో 8 భారత్​లోనే.. అందులో దిల్లీ మాత్రం లేదు' - దిల్లీ లేటెస్ట్ కాలుష్యం న్యూస్​

ప్రపంచంలో ఉన్న 10 అత్యంత కాలుష్య నగరాలలో ఎనిమిది భారత్​లోనే ఉన్నాయనీ.. అయితే ఆ జాబితాలో దిల్లీ లేదని ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ అన్నారు. ప్రపంచ అత్యుత్తమ నగరంగా దిల్లీని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

KEJRIWAL
ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​
author img

By

Published : Oct 24, 2022, 9:02 PM IST

ఆసియాలోని పది అత్యంత కాలుష్య నగరాల్లో 8 భారత్‌లోనే ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్​ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వాటిలో దేశ రాజధాని దిల్లీ మాత్రం లేదని ఆయన చెప్పారు. కొన్నేళ్ల క్రితం వరకు.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా ఉన్న దేశ రాజధాని ఇకపై ఆ జాబితాలో ఉండబోదన్నారు. ఈ మేరకు మీడియా కథనాలను ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

కాలుష్యంపై జరిపిన పోరాటంలో దిల్లీ ప్రజలు ఎంతో శ్రమించారని.. ప్రస్తుతం ఎంతో మెరుగుపడ్డామని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాలుష్య నివారణలో దిల్లీ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని.. ఇందుకు మరింత సమయం పడుతుందని వివరించారు. దిల్లీని ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.