ట్విట్టర్ తీరుపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు అధికారుల నియామకంలో జాప్యం తగదని హెచ్చరించింది. అధికారుల నియామకానికి ఇంకెంత కాలం పడుతుందని ట్విట్టర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.
అధికారుల నియామకంలో జాప్యం వహిస్తే సహించేది లేదని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. భారత్లో ట్విట్టర్ కొనసాగాలంటే అధికారుల నియామకంలో ఆలస్యం ఉండకూడదని పేర్కొంది. అధికారిని నియమించకపోవడం కచ్చితంగా చట్ట ధిక్కరణ కింద పరిగణిస్తామని స్పష్టం చేసింది.