ETV Bharat / bharat

కాబుల్​ విమానాశ్రయంలో భారతీయులపై తాలిబన్ల కాల్పులు! - అమెరికా

తాలిబన్ల భీకర కాల్పుల మధ్య దిక్కుతోచని స్థితిలో ఉన్నవారిని సాహసించి స్వదేశాలకు తరలించింది భారత వాయుసేన. భారత్​ వచ్చే క్రమంలో మన దేశస్థులు ఎక్కే విమానంపై తాలిబన్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అయితే ఆ సమయంలో అక్కడి నుంచి ఎలా బయటపడ్డారనే విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం..

Rescue of Indians from Kabul
తాలిబన్
author img

By

Published : Aug 20, 2021, 9:56 PM IST

Updated : Aug 21, 2021, 7:15 AM IST

భారతీయులు స్వదేశానికి తరలుతున్న క్రమంలో కాబుల్​ విమానాశ్రయంలో తాలిబన్లు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు సవితా షాహీ. భారత వాయుసేన.. అఫ్గానిస్థాన్​ నుంచి సురక్షితంగా భారత్​ తరలించినవారిలో ఆమె కూడా ఒకరు. భీతావహ పరిస్థితుల్లో ధైర్యసాహసాలతో వాయుసేన రెస్క్యూ ఆపరేషన్ చేసిందని తన స్వస్థలం ఉత్తరాఖండ్​లోని దెహ్రాదూన్​కు చేరుకున్న అనంతరం ఆమె వివరించారు. సవితా.. గత 8 ఏళ్లుగా అఫ్గాన్​లోనే యూఎస్ ఆర్మీ, నాటో వైద్య బృందంలో పనిచేస్తున్నారు.

భారత్​ రెస్క్యూ ఆపరేషన్​ను వివరిస్తున్న సవితా షాహీ

సవితా మాటల్లో భారత్​ రెస్క్యూ ఆపరేషన్​..

"అఫ్గానిస్థాన్​లో పరిస్థితి ఇంత అనూహ్యంగా మారుతుందని ఊహించలేదు. సెప్టెంబరు 11లోపు ఏ దేశ ఆర్మీ అక్కడ ఉండరాదని హెచ్చరించినా.. ఆలోపే ఆక్రమణలకు తెగబడ్డారు తాలిబన్లు. ఆగస్టు 13,14 తేదీల్లో ఒక్కసారిగా కాబుల్​ను వశం చేసుకున్నారు. దీంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు పెట్టడం ప్రారంభించారు.

ఆగస్టు 15న కాబుల్ విమానాశ్రయాన్ని పూర్తిగా తాలిబన్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. విమానాలన్నీ రద్దయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. ఆగస్టు 16న పౌర విమనాశ్రయానికి దగ్గర్లోనే ఉన్న మిలటరీ ఎయిర్​పోర్ట్​ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అమెరికా సైన్యం సన్నాహాలు చేపట్టింది.

సాయంత్రం 6గంటల సమయంలో.. అమెరికా, నాటో దళాల్లో పనిచేసేవారు విమానాశ్రయానికి చేరుకోగానే తాలిబన్లు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడి నుంచి ప్రజలను క్యాంపునకు తరిలించిన ఆర్మీ.. మరుసటి రోజు ఉదయం వరకు వేచిచూడాలని నిర్ణయించింది.

అప్పటికే విమనాశ్రయం బయట ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. తమతమ దేశాలకు వెళ్లాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో భారత రాయబార కార్యాలయంలోని ఓ అధికారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న నా బృందంలోని సభ్యుడికి ఓ సమాచారం అందింది. భారత దౌత్యవేత్తలు, ఉద్యోగులు, వారి కుటుంబాలను రక్షించేందుకు మిలటరీ ఎయిర్​పోర్టుకు భారత వాయుసేన విమానం రాబోతోందని దాని సారాంశం.

అప్పుడు ఊపిరి పీల్చుకున్నాం. యూఎస్​ ఆర్మీ వైద్య బృందం నుంచి ఏడుగురు సహా దాదాపు 150 మంది ఆగస్టు 17న ఉదయం 7గంటలకు ఐఏఎఫ్​ విమానంలో గుజరాత్​ బయలుదేరాం. ఇక్కడ మాకు ఘన స్వాగతం లభించింది."

మన విమానంలోనూ రద్దీ..

అయితే భారత్​ తీసుకొచ్చిన విమానంలోనూ సీట్లు దొరక్క చాలా మంది కిందే కూర్చున్నారని సవితా చెప్పారు. జామ్​నగర్​ చేరుకున్నాక వారిని దిల్లీ తరలించారని వివరించారు.

వారికీ వాయుసేన అండ..

అఫ్గాన్​ సంక్షోభం వేళ భారత వాయుసేన మరోమారు వార్తల్లో నిలిచింది. భారతీయులనే కాకుండా.. నాటో సిబ్బంది, ఇతర దేశాలకు చెందిన వారిని కూడా తమ విమానాల్లో ఎక్కించుకుని.. వారికి అండగా నిలిచింది.

ఇవీ చూడండి:

Afghan Crisis: అఫ్గాన్​లో ఆ రోజు ఏం జరుగుతుంది?

Afghan Crisis: ఇళ్లల్లోకి దూరి.. చిత్రహింసలు పెట్టి..!

Taliban news: తాలిబన్లపై అఫ్గాన్​ ప్రజల తిరుగుబాటు!

Last Updated : Aug 21, 2021, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.