ETV Bharat / bharat

మరో దారుణం.. యువతిని చంపి, బావిలో శరీర భాగాలు పడేసి.. - మహిళా ఎస్సైపై వేధింపులు

యువతి మృతదేహాన్ని ముక్కలుగా చేసి బావిలో పడేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, వివాహితను కలిసేందుకు వెళ్లిన ప్రియుడిని ఆమె భర్త, అత్తమామలు, బావ కలిసి హత్యచేశారు. ఈ ఘటన బిహార్​లో వెలుగుచూసింది.

dead body of girl found in pieces
బావిలో యువతి మృతదేహం
author img

By

Published : Nov 15, 2022, 7:04 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని ఆజంగఢ్​లో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువతి మృతదేహాన్ని అనేక ముక్కలుగా చేసి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడేశారు నిందితులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీశారు. ఫోరెన్సిక్ టీమ్​​, డాగ్​ స్క్వాడ్​ను రంగంలోకి దించారు పోలీసులు.
ప్రస్తుతం ఈ కేసులో నిందితులిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అహ్రాలా పోలీస్​ స్టేషన్​ పరిధిలో మంగళవారం జరిగిందీ ఘటన. మృతురాలి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 2 రోజుల క్రితమే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

వివాహేతర సంబంధం కారణంగా..
బిహార్‌లోని ఆరాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాన్ని తీసింది. ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన యువకుడిని.. ఆమె భర్త, అత్తమామలు, బావ కర్రలతో దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని చందన్​ తివారీ(26)గా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతుడు చందన్, రూబీ దేవి అనే యువతి.. బనారస్​లోని ఓ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు. ఆ సమయంలో వీరిద్దరు ప్రేమించుకున్నారు. ఇరువురు ధామ్​వాల్​ గ్రామానికి చెందినవారే. అయితే రూబీదేవికి రాజు పాసవాన్​ అనే వ్యక్తితో 2018లో వివాహమైంది. అయినా చందన్, రూబీ మధ్య వివాహేతర సంబంధం మాత్రం ఆగలేదు. రూబీ దేవిని కలిసేందుకు వెళ్లగా చందన్​ తలపై ఆమె భర్త, బావ కర్రలతో దాడిచేసి చంపేశారు.

youth beaten to death
మృతుడు చందన్​ తివారీ

ఎస్సైపై ఫిర్యాదు..
ఎస్సై తనను అత్యాచారం చేశాడని ఆరోపించారు ఓ మహిళా సబ్​ ఇన్​స్పెక్టర్. ఈ ఘటన మహారాష్ట్ర ముంబయిలోని రబలే పోలీస్ స్టేషన్​లో పరిధిలో జరిగింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై అనికేత్ గులాబ్​రావ్​ (29) సమతానగర్ పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వర్తిస్తున్నారు. 2019 నుంచి 2022 సెప్టెంబరు వరకు తనపై పలుమార్ల అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఎదురుతిరిగితే పరువు తీస్తానని బెదిరింపులకు దిగేవాడని పేర్కొన్నారు. నాసిక్‌లో పోలీసు ట్రైనింగ్ సమయంలో ఆమెను తనను పెళ్లిచేసుకుంటానని మాటిచ్చి లైంగికంగా వాడుకున్నాడని ఆమె ఆరోపించారు.

ఇవీ చదవండి: రూ.70 పల్లీలకు గ్రీన్​ కలర్.. పిస్తా అంటూ కిలో రూ.1100కు అమ్మకం

రైలులో ఇకపై నచ్చిన భోజనం.. పిల్లలకు, షుగర్ ఉన్నవారికి ప్రత్యేక మెనూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.