ETV Bharat / bharat

డ్యామ్​లో ముగ్గురు యువతుల మృతదేహాలు.. ఆత్మహత్యా? హత్యా? - three dead bodies in jhansi

డ్యామ్​లో ముగ్గురు యువతుల మృతదేహాలు తేలుతూ కనిపించడం.. ఉత్తర్​ప్రదేశ్​లోని ఝాన్సీ జిల్లాలో కలకలం రేపింది. ఇది హత్యనా? లేక ఆత్మహత్యనా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు, అమేఠీ జిల్లాలో బహిర్భూమికు వెళ్లిన మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు.

dead-bodies-of-3-girls-found-in-uttarpradesh  jhansi-kurecha-dam

author img

By

Published : Oct 9, 2022, 10:56 AM IST

Updated : Oct 9, 2022, 2:02 PM IST

Three Girls Found Dead In Dam: ఉత్తర్​ప్రదేశ్​ ఝాన్సీ జిల్లాలోని డ్యామ్​లో ముగ్గురు యువతుల మృతదేహలు అనుమానాస్పద రీతిలో లభ్యమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. జిల్లాలోని మౌరానీపుర్ పరిధిలో ఉన్న కురేచా డ్యామ్​లో ఓ యువతి మృతదేహం తేలుతున్నట్లు శనివారం సాయంత్రం పోలీసులకు స్థానిక ప్రజలు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు.. డ్యామ్​ దగ్గరకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కాసేపటికే డ్యామ్​లో మరో ఇద్దరి మృతదేహాలు తేలుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

మళ్లీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించారు. శవపరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు.. ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. మృతురాళ్లను రీనూ(28), రీతూ(30), రింకూ(26)గా పోలీసులు గుర్తించారు. రీనూ, రీతూ సొంత అక్కచెల్లెళ్లు అని, రింకూ వారి స్నేహితురాలని చెప్పారు.

'అంతా అనుమానాస్పదంగా ఉంది'
అయితే ఈ వ్యవహారం అంతా అనుమానాస్పదంగా ఉందని పోలీసులు తెలిపారు. ముగ్గుర్ని హత్య చేసి ఎవరైనా డ్యామ్​లో పడేశారా? లేక వారే ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామన్నారు. అసలు కారణాలు మాత్రం శవపరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే తెలుస్తాయని చెప్పారు. కుటుంబసభ్యులను కూడా విచారిస్తున్నట్లు తెలిపారు.

'నెలకోసారి వెళ్లి వచ్చేవారు..'
డ్యామ్​కు వెళ్తామని చెప్పి ముగ్గురు యువతులు శుక్రవారం ఇంటి నుంచి బయలుదేరారని యువతుల కుటుంబసభ్యులు తెలిపారు. నెలకోసారి ముగ్గురు డ్యామ్​ వద్దకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేవారని చెబుతున్నారు. అయితే శుక్రవారం రాత్రి తిరిగి రాకపోవడం వల్ల ఫోన్​ చేశామని.. స్విచ్చాఫ్​ వచ్చిందని చెప్పారు.

dead-bodies-of-3-girls-found-in-jhansi-kurecha-dam
డ్యామ్​ వద్ద పోలీసులు

బహిర్భూమికి వెళ్లిన బాలికపై రేప్​
ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బహిర్భూమికి వెళ్లిన దళిత మైనర్​పై అఘయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.

పోలీసుల వివరాల ప్రకారం.. అమేఠీ జిల్లాలోని జామో ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక.. గత ఆదివారం బహిర్భూమికి వెళ్లింది. అయితే అదే సమయంలో దుర్గా మండపంలో సౌండ్​ సెట్​ ఏర్పాట్లు చూసుకునే మోను అనే వ్యక్తి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు మోనును అరెస్టు​ చేశారు.

బందీగా ఉంచి గ్యాంగ్​రేప్​
రాజస్థాన్​లోని అజ్మేర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. దళిత మహిళను బందీగా ఉంచి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కామాంధులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడతున్నారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జిల్లాకు చెందిన బాధితురాలిపై గ్రామ పూజారి సంజయ్ శర్మ.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో వీడియో కూడా రికార్డు చేశాడు. ఆ తర్వాత వీడియో పేరుతో డబ్బులు డిమాండ్​ చేసి వసూలు చేశాడు. కొద్దిరోజుల తర్వాత ఆమెను కిడ్నాప్​ చేసి మరికొందరు వ్యక్తులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు సంజయ్​ శర్మ.

ఆ సమయంలో బాధితురాలికి మత్తు ఇంజెక్షన్​ ఇచ్చి మరీ అఘాయిత్యానికి ఒడిగట్టారు. సెప్టెంబరు 27న రాత్రి మహిళను పోలీస్​స్టేషన్​ బయట పడేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గత కొద్దిరోజులుగా వారు తనను బందీగా ఉంచి అనేక సార్లు దుశ్యర్యకు పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

ఇవీ చదవండి: 'ఆమె' వలలో బడా బాబులు.. ఖరీదైన కార్లు.. లగ్జరీ ఫాంహోస్​లో ఫుల్​ ఎంజాయ్​..చివరకు..

రైల్లో మహిళకు కాంగ్రెస్​ ఎమ్మెల్యేల వేధింపులు.. విచారణ కమిటీ వేసిన సీఎం

Last Updated : Oct 9, 2022, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.