ETV Bharat / bharat

Dasara Special Non Veg Recipes : దసరాకి మటన్​ కర్రీ ఇలా ట్రై చేయండి.. వావ్ అనాల్సిందే..! - మటన్ మసాలా కర్రీ తయారీ విధానం

Dasara Special Mutton Recipes : దసరా అంటేనే ధూమ్ ధామ్​గా సాగే పండగ. ఖచ్చితంగా వేట తెగాల్సిందే. ప్రతీ ఇంట మటన్ ఘుమఘుమలు ఆస్వాదించాల్సిందే. అయితే.. రెగ్యులర్​గా కాకుండా.. ఈసారి ఇలా కుక్ చేయండి. మటన్, తలకాయ, బోటీ వెరైటీస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Mutton Special Non Veg Recipes
Dasara Special Non Veg Recipes
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 5:19 PM IST

Dussehra 2023 Special Mutton Recipes in Telugu : దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి జరుపుకోవడం ఆనవాయితీ. దసరా వచ్చిదంటే చాలు.. ప్రతి ఇంట జరిగే సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తెలంగాణలో అయితే విజయదశమి(Vijayadasami)ని పురస్కరించుకుని పల్లె నుంచి పట్టణం వరకు చుక్క, ముక్క లేనిది పండగ జరుపుకోరు. సామాన్య పౌరుల నుంచి ఉన్నత వర్గాల వరకు అందరూ దసరా సంబరాల్లో మునిగితేలుతారు. కొత్త బట్టలు, పిండివంటలతో పాటు మాంసాహారం తినే ప్రతి ఇంట్లో నాన్​వెజ్ ఐటమ్స్ ఘుమఘుమలాడాల్సిందే. అందులో మటన్​ది ప్రత్యేక స్థానం. అయితే ఈసారి దసరా(Dussehra 2023) పండక్కి మేము చెప్పే ఈ మటన్ ఐటమ్స్ ట్రై చేశారంటే.. గల్లీ మొత్తం మీ ఇంటిగుమ్మం వైపు చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ సూపర్ మటన్​ రెసిపీలపై ఓ లుక్కేయండి..

How to Prepare Mutton Masala Curry : దసరా పండక్కి ప్రతిఒక్కరూ నాన్​వెజ్ ఐటమ్స్​లో మటన్​కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అందులో చాలా మంది మటన్ మసాలా కర్రీని ఇష్టపడతారు. ఎందుకంటే దసరా అంటే చుక్క, ముక్క కాబట్టి.. మద్యం ప్రియులకు మంచి స్టఫ్​గా ఉపయోగపడుతుంది. అయితే మీరు కూడా మటన్ ప్రియులైతే.. మేము చెప్పే విధంగా మటన్(Mutton Masala Curry) మసాలా కర్రీ ట్రై చేస్తే.. బొక్క కూడా వదలరు సుమీ.! అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

మటన్ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు :

  • మటన్‌- కేజీ
  • నూనె- నాలుగు చెంచాలు
  • ఉల్లిపాయ- ఒకటి (పెద్దది)
  • కారం- రెండు చెంచాలు
  • పసుపు- పావుచెంచా
  • పెరుగు- కప్పు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్‌- రెండు చెంచాలు
  • ధనియాలపొడి- చెంచా
  • గరంమసాలాపొడి- చెంచా
  • ఉప్పు- తగినంత
  • కొబ్బరిపొడి- నాలుగు చెంచాలు
  • గసగసాలు- రెండు చెంచాలు
  • నీళ్లు- రెండు కప్పులు
  • కొత్తిమీర- కొద్దిగా

మటన్ మసాలా కర్రీ తయారీ విధామిలా..

How to Make Mutton Masala Curry in Telugu : ముందుగా మీరు గసగసాలు, కొబ్బరిపొడిని కొద్దిగా వేయించుకుని మిక్సీలో ముద్దగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్​ చేసి కుక్కర్‌లో నూనె వేడి చేసుకుని అందులో తరిగిన ఉల్లిపాయముక్కలు వేసుకుని బంగారు రంగులోకి వచ్చేంతవరకూ వాటిని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత పైన పేర్కొన్న విధంగా ఆ మిశ్రమానికి పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అవి పచ్చివాసన పోయేంతవరకూ వేయించుకోవాలి.

అనంతరం కడిగి శుభ్రం చేసిన మటన్‌ ముక్కలు అందులో వేసుకోవాలి. ఆ తర్వాతే కారం, ధనియాలపొడి, ఉప్పు వేసుకోవాలి. సన్న సెగమీద మంటని ఉంచి పది నిమిషాలపాటు ఉడికించుకోవాలి. అలా ఉడికించిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరిపేస్ట్‌, పెరుగు, గరంమసాలా యాడ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలిపి... మూడు నిమిషాలు ఉంచిన తర్వాత దానిలో తగినంత వాటర్ పోసి కుక్కర్‌ మూతపెట్టేయాలి. మటన్ మెత్తబడే వరకూ ఆ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత దించుకొని కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే సరిపోతుంది. అంతే ఘుమఘుమలాడా మటన్ మసాలా కర్రీ రెడీ.!

How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!

తలకాయ కర్రీ(Talakaya Curry) : దసరా పండక్కి చాలా మంది మేక తలకాయ తెచ్చుకుని వండుకుందామనుకుంటారు. కానీ, దానిని ఎలా వండాలో తెలియక ఆగిపోతారు. అలాంటి వారు మేము చెప్పేవిధంగా ట్రై చేస్తే చాలు.. చాలా సింపుల్​గా తలకాయ కర్రీ వండేయొచ్చు. అయితే ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు :

  • తలకాయ మాంసం- కిలో
  • నూనె- నాలుగు చెంచాలు
  • షాజీర- చెంచా
  • ఉల్లిపాయ- పావుకిలో
  • టమాటాలు- 100గ్రా.
  • పచ్చిమిర్చి- ఆరు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్‌- చెంచా
  • కారం- రెండు చెంచాలు
  • పసుపు, ఉప్పు- తగినంత
  • ధనియాలపొడి- చెంచా
  • గరంమసాలాపొడి- చెంచా
  • పుదీనా- మూడురెబ్బలు
  • కొత్తిమీర- కొద్దిగా

తలకాయ కర్రీ తయారు చేసుకునే విధానమిలా..

How to Prepare Talakaya Curry in Telugu : ముందుగా మీరు వేడినీటిలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి తలకాయ మాంసాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో పైన పేర్కొన్న విధంగా నూనె వేసుకుని వేడెక్కాక షాజీరా, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి వేసి నాలుగు నిమిషాల పాటు ఆ మిశ్రమాన్ని దోరగా వేయించాలి. అవి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు, ఉప్పు వేసి మరో మూడు నిమిషాల పాటు వాటిని వేగనివ్వాలి.

అనంతరం ఆ మిశ్రమానికి తలకాయ మాంసం, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, పసుపు యాడ్ చేసుకుని బాగా కలిపి పది నిమిషాలుంచితే నీరంతా పోతుంది. ఆ తర్వాత దానికి కారం, ధనియాలపొడి, గరంమసాలాపొడి, జీలకర్రపొడి, పుదీనా వేసి ఐదునిమిషాల పాటు వేయించి.. తగినంత నీరుపోసి మీడియం మంటపైన నలభై నిమిషాలపాటు ఉడికించుకోవాలి. ఇక చివరిగా కొత్తిమీర చల్లుకుని దించుకుంటే చాలు.. నోరూరించే తలకాయ కర్రీ మీ ముందుంటుంది.

Telangana Special Natukodi Curry : తెలంగాణ స్టైల్లో నాటుకోడి కర్రీ.. మసాలా నషాళాన్ని తాకాల్సిందే!

బోటీమసాలాఫ్రై(Boti Masala Fry) :

కావాల్సిన పదార్థాలు :

  • బోటీ- కిలో
  • నూనె- నాలుగు చెంచాలు
  • షాజీరా- చిన్నచెంచా
  • ఉల్లిపాయలు- పావుకిలో
  • పచ్చిమిర్చి- ఆరు
  • ఉప్పు- తగినంత
  • కారం- చెంచా
  • అల్లంవెల్లుల్లిపేస్ట్‌- చెంచా
  • పసుపు- తగినంత
  • గరంమసాలాపొడి- చెంచా
  • మిరియాలపొడి- అరచెంచా
  • కరివేపాకు- రెమ్మ
  • పుదీనా, తరిగిన కొత్తిమీర- రెండు చెంచాలు

How to Prepare Boti Masala Fry in Telugu :

బోటీమసాలాఫ్రై తయారీ విధానం : ముందుగా మీరు బోటీని మంచి నీటిలో శుభ్రం చేసుకుని కుక్కర్‌లో లీటరున్నర నీళ్లు పోసుకుని నాలుగు విజిల్స్‌ వచ్చేంతవరకూ దానిని ఉడికించుకోవాలి. ఆ తర్వాత నీళ్లు వడకట్టేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయిలో నూనె పోసుకుని అందులో షాజీరా, ఉల్లిపాయముక్కలు వేసుకుని అవి మంచి రంగులోకి వచ్చేంతవరకూ వాటిని వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ముందే ఉడకబెట్టి పక్కన ఉంచిన బోటీ ముక్కలు వేయాలి. రెండు నిమిషాలు ఆ మిశ్రమాన్ని పెద్దమంటపైన వేయించుకోవాలి. అపై గరంమసాలా, ధనియాలపొడి, మిరియాలపొడి, కారం, ఉప్పు, కరివేపాకు వేసి ఐదు నిమిషాల పాటు సన్నమంటమీద ఉంచాలి. ఇక దించేటప్పుడు కొత్తిమీర, పుదీనా చల్లుకుంటే సరిపోతుంది. ఇలా ఈ దసరా పండక్కి ఘుమఘుమలాడే మటన్ రెసిపీలు వండుకొని.. ఇంటిల్లిపాది ఆనందోత్సహాల్లో మునిగితేలండి.!

How to Prepare Hyderabadi Chicken Dum Biryani : సండే ధమాకా.. హైదరాబాదీ బిర్యానీ.. ట్రై చేయండిలా..!

చికెన్‌ కూరలు.. కమ్మగా, కారంగా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.