Covid Cases in India: భారత్‌లో కొవిడ్ కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జరిపిన 13,46,534 పరీక్షల్లో 67,597 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,118 మంది మరణించారు. 1,80,456 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు ప్రస్తుతం 2.62 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 96.19 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,23,39,611
- మొత్తం మరణాలు: 5,04,062
- యాక్టివ్ కేసులు: 9,94,891
- మొత్తం కోలుకున్నవారు: 4,08,40,658
దేశంలో కొత్తగా 55,78,297 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,70,21,72,615 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
World Corona cases
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి కాస్తా తగ్గుముఖం పట్టింది. కొత్తగా 18 లక్షల మందికి కరోనా సోకింది. 8,126 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39.80 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 57,68,460కు పెరిగింది.
- రష్యాలో కొత్తగా 1.71 లక్షల మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 609 మంది మరణించారు.
- అమెరికాలో మరో 1.56 లక్షల మందికి కొవిడ్ సోకింది. 1,269 మంది చనిపోయారు.
- జర్మనీలో కొత్తగా 1.38 లక్షల మందికి వైరస్ సోకగా.. 129 మంది మృత్యువాత పడ్డారు.
- టర్కీలో తాజాగా 96 వేలకు పైగా కరోనా కేసులు బయటపడగా.. 236 మంది బలయ్యారు.
- జపాన్‌లో ఒక్కరోజే దాదాపు 92 వేల మందికి వైరస్ సోకింది. మరో 62 మంది మృతి చెందారు.
ఇవీ చూడండి: