ETV Bharat / bharat

దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు

Covid cases in India: భారత్​లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మరో 2,82,970 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజు 441 మంది మరణించారు. 1,88,157 మంది కొవిడ్​ను జయించారు.

covid cases
కరోనా కేసులు
author img

By

Published : Jan 19, 2022, 9:33 AM IST

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు.. 2,82,970 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 441 మంది మరణించారు. 1,88,157 మంది కోలుకున్నారు. కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం మరణాలు: 4,87,202
  • యాక్టివ్ కేసులు: 18,31,000
  • మొత్తం కోలుకున్నవారు: 3,55,83,039

Omicron Cases In India

దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,961కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 76,35,229 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,58,88,47,554కు చేరింది.

అంతర్జాతీయంగా..

corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 30,16,974 మందికి కరోనా సోకింది. 8,039 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 33,51,15,363కి చేరగా.. మరణాలు 55,72,897కు పెరిగింది.

  • అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా 5,46,714 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 1,720 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 6.8 కోట్లు దాటింది.
  • ఫ్రాన్స్​లో ఒక్కరోజే 4,64,769 కేసులు వెలుగుచూశాయి. మరో 375 మంది చనిపోయారు.
  • ఇటలీలో 2,28,179 కొత్త కేసులు బయటపడగా.. 434 మంది మరణించారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 1,32,254 మందికి వైరస్​ సోకగా.. 317 మంది చనిపోయారు.
  • అర్జెంటీనాలో తాజాగా 1.2 లక్షల కరోనా కేసులు బయటపడగా.. 189 మంది బలయ్యారు.
  • జర్మనీలో 95 వేల మందికి వైరస్ సోకింది. మరో 199 మంది మృతి చెందారు.
  • బ్రిటన్​లో మరో 94 వేల మంది వైరస్ బారిన పడ్డారు.​ 438 మంది మృతి చెందారు.
  • స్పెయిన్​లో 94 వేల మందికి కొత్తగా వైరస్​ సోకింది. మరో 284 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: పిల్లలకు టీకా.. ఆరోగ్య సిబ్బందికి భారత్‌ బయోటెక్‌ కీలక సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.