ETV Bharat / bharat

'ఆ వేరియంట్​పై భయం లేదు.. వ్యాప్తి చాలా తక్కువే!'

భారత్​లో కొవిడ్-19 కొత్త వేరియంట్ ఏవై.4.2 వ్యాప్తి(Covid New Variant in India) 0.1 శాతం కంటే తక్కువగానే ఉందని జీనోమ్​ సీక్వెన్సింగ్​ కన్సార్టియం(ఇన్సాకాగ్) వెల్లడించింది. ఆందోళన చెందాల్సినంత వ్యాప్తి లేదని పేర్కొంది.

COVID-19
కొవిడ్-19
author img

By

Published : Nov 7, 2021, 10:18 PM IST

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఏవై.4.2 వ్యాప్తిపై(Covid New Variant in India) జీనోమ్​ సీక్వెన్సింగ్​ కన్సార్టియం(ఇన్సాకాగ్)​ కీలక ప్రకటన చేసింది. భారత్​లో ఏవై.4.2 వ్యాప్తి 0.1 శాతం కంటే తక్కువ ఉందని.. ఆందోళన చెందాల్సినంత వ్యాప్తి లేదని స్పష్టం చేసింది.

"ప్రస్తుతం దేశంలో ఏవై.4.2 వ్యాప్తి చెందుతుందన్న ఆధారాలు లేవు. భారత్​లో ఇప్పటికీ డెల్టా వేరియంట్​ మాత్రమే ఆందోళనకరంగా ఉంది. వేరే వేరియంట్లు ఆందోళనకరంగా లేవు."

--ఇన్సాకాగ్

డెల్టా వేరియంట్ మొదటగా అక్టోబరులో వ్యాప్తి చెందింది. దీంతో దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రబలింది. ఏప్రిల్, మేలో కేసుల సంఖ్య తారస్థాయికి చేరింది.

జీనోమ్​ వేరియంట్లపై పర్యవేక్షించేందుకు జీనోమ్​ సీక్వెన్సింగ్​ కన్సార్టియం(ఇన్సాకాగ్)​ను 2020 డిసెంబర్​లో ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తుంది.

ఇతర రాష్ట్రాల్లో కేసులు ఇలా..

  • కేరళలో కొత్తగా 7,124 మందికి కరోనా(Kerala Corona Cases) సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా మరో 201 మంది మరణించారు. మరో 7,488 మంది వైరస్​నుంచి కోలుకున్నారు. బంగాల్​లో కొత్తగా 723 మందికి వైరస్ సోకింది. 11 మంది మృతిచెందారు.
  • మహారాష్ట్రలో కొత్తగా 892 కేసులు నమోదయ్యాయి. 16 మంది వైరస్​తో మరణించారు.
  • కర్ణాటకలో తాజాగా 239 కేసులు నమోదు అయ్యాయి. మరో ఐదుగురు వైరస్​ బారినపడి మరణించారు.
  • ఒడిశాలో మరో 318 మందికి వైరస్ సోకింది. మరో ముగ్గురు మహమ్మారి కారణంగా మృతి చెందారు.

Corona cases in India: దేశంలో కొత్తగా 10,853 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.