Corona Cases in India : దేశంలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 6,093 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 6,768 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.7శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.11 శాతంగా కొనసాగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,44,72,241
- క్రియాశీల కేసులు: 49,636
- మొత్తం మరణాలు: 5,28,121
- కోలుకున్నవారు: 4,39,06,972
Vaccination In India :
దేశంలో గురువారం 28,09,189 కోట్ల మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 214.55 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,16,504 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 4,94,915 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,587 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,24,42,097 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,12,111 మంది మరణించారు. గురువారం మరో 7,23,466 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,02,36,549కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 1,26,487 కేసులు వెలుగుచూశాయి. మరో 265 మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో 72,599 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 64 మంది మృతి చెందారు.
- రష్యాలో 47,958 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వల్ల 93 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో 46,661 కొవిడ్ కేసులు నమోదుకాగా, 287 మంది మరణించారు.
- జర్మనీలో 35,995 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 119 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చదవండి: 'దుస్తులు ధరించే హక్కు ఉందంటే విప్పే హక్కూ ఉన్నట్లేనా?'.. హిజాబ్ కేసులో సుప్రీం వ్యాఖ్యలు
'కర్తవ్యపథ్'గా మారనున్న 'రాజ్‌పథ్'.. మోదీ చేతులమీదుగా నేడే ప్రారంభం