ETV Bharat / bharat

'కెప్టెన్ సారథ్యంలోనే 2022 ఎన్నికల బరిలోకి'

2022 అసెంబ్లీ ఎన్నికల్లో.. కెప్టెన్ అమరిందర్ సింగ్ సారథ్యంలోనే పంజాబ్ కాంగ్రెస్​ పోటీ చేస్తుందని ఆ పార్టీ ఇన్​ఛార్జ్​ హరీశ్​ రావత్ స్పష్టం చేశారు. పార్టీలో నెలకొన్న అంతర్గత వ్యవహారాలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.

Punjab Congress
పంజాబ్ కాంగ్రెస్
author img

By

Published : Aug 25, 2021, 2:45 PM IST

పంజాబ్​ సీఎం కెప్టెన్ అమరిందర్​ సింగ్ సారథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో పంజాబ్ కాంగ్రెస్​.. పోటీ చేస్తుందని ఆ పార్టీ ఇన్​ఛార్జ్​ హరీశ్​ రావత్​ స్పష్టం చేశారు. పార్టీలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూ వర్గం ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం రావత్ మాట్లాడారు. కెప్టెన్​ను తొలగించటం సాధ్యం కాదన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు.

"పార్టీలో ఇలాంటి వివాదాలు జరుగుతూనే ఉంటాయి. పీసీసీ పదవి నియామకం తర్వాత ఇలాంటి వివాదాలు తలెత్తుతాయని ఊహించాం. మేము సమస్యను పరిష్కరిస్తాం. ప్రతిఒక్కరు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీని నమ్ముతున్నారు. కానీ ఒక్కసారిగా ఏమైంది. ఎందుకు చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తాం."

-హరీశ్ రావత్, పంజాబ్ కాంగ్రెస్ ఇన్​ఛార్జ్

అంతకుముందు నలుగురు కేబినెట్ మంత్రులు రాజిందర్ సింగ్ బజ్వా, సుఖ్​బిందర్​ సింగ్ సర్కారియా, సుఖ్​జిందర్​ సింగ్​ రంధ్వారా, చరణ్​జిత్​ సింగ్​ ఛన్నిలు హరీశ్ రావత్​తో సమావేశం నిర్వహించారు.

నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూ వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు.. ఇప్పటికే ముఖ్యమంత్రి అమరిందర్​ సింగ్​పై తీవ్ర విమర్శలు చేశారు. తమకిచ్చిన హామీలను కెప్టెన్​ నెరవేర్చలేదని ఆరోపించారు.

ఇవీ చదవండి:

సీఎంపై మంత్రులు, ఎమ్మెల్యేల తిరుగుబాటు

పంజాబ్‌లో సిద్ధూ రాజకీయ కేళి- సీఎం పదవి కోసమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.