ETV Bharat / bharat

College Student Kidnapped and Raped : విద్యార్థిని కిడ్నాప్, రేప్.. నగ్నంగా ఫొటోలు తీసి బెదిరింపులు - రాజస్థాన్‌లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం

College Student Kidnapped and Raped : బంగాల్​లో కాలేజ్ విద్యార్థినిపై అత్యాచారం చేశారు ఇద్దరు వ్యక్తులు. పనిమీద బయటకు వెళ్లిన యువతిని కిడ్నాప్​ చేసి ఈ దారుణానికి ఒడిగట్టారు. గురువారం ఈ ఘటన జరగ్గా.. దీనిపై పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది.

college-student-kidnapped-and-raped-by-two-youth-in-west-bengal
కాలేజీ విద్యార్థిని కిడ్నాప్ అనంతరం అత్యాచారం
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 10:10 AM IST

Updated : Sep 17, 2023, 10:41 AM IST

College Student Kidnapped and Raped : కాలేజ్ విద్యార్థినిని కిడ్నాప్​ చేసి అత్యాచారం చేశారు ఇద్దరు వ్యక్తులు. మొబైల్​తో ఆమె నగ్న ఫొటోలు తీసి.. ఘటన గురించి ఎవరితోనూ చెప్పొద్దని బెదిరించారు. తాము చెప్పినట్లు చేయకపోతే ఆ ఫొటోలు వైరల్​ చేస్తామని హెచ్చరించారు. అనంతరం బాధితురాలి వద్ద ఉన్న డబ్బును తీసుకుని పారిపోయారు. బంగాల్​లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఈ ఘటన జరిగింది.

బాధితురాలు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం.. మందిర్​ బజార్​కు చెందిన యువతి గురువారం ఉదయం 10 గంటలకు బ్యాంక్​కు వెళ్లింది. అనంతరం అక్కడ తన స్నేహితుడ్ని కలిసింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. ఆమెను కిడ్నాప్​ చేశారు. వారిలో ఓ వ్యక్తి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. సికందర్‌పుర్ జంక్షన్​లో ఎవరూ లేని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. వారిని మరోసారి కలవాలని.. లేకపోతే ఫొటోలు వైరల్​ చేస్తామని బెదిరించారు.

ఘటనపై గురువారం రాత్రి మందిర్​ బజార్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. అయితే దీనిపై పోలీసులు అలసత్వం వహిస్తున్నారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులపై ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. రాజకీయ దురుద్దేశంతోనే తన భర్తపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది ఓ నిందితుడి భార్య.

ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బాధితురాలిని కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. వైద్యపరీక్షలు నిర్వహించి ఆమె వాంగ్మూలం నమోదు​ చేసినట్లు పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు జరుపుతున్నట్లు వెల్లడించారు.

మైనర్​పై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం..
14 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. బాధితురాలిని కోచింగ్ సెంటర్​ వద్ద దిగబెడతాననే సాకుతో.. స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. రాజస్థాన్​లోని కోటా జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడితో పాటు అతడికి సాయం చేసిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడ్ని విక్రమ్​(19)గా, మరొక వ్యక్తిని చంద్ర ప్రకాష్(21)గా వారు గుర్తించారు. ఇంకొక నిందితుడికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. బాధితురాలు, నిందితుడు గతంలో ఒకే స్కుల్​లో చదువుకున్నారు. ఆ చనువుతోనే బాధితుడు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.

8 Year Old Girl Kidnapped and Raped : 8ఏళ్ల బాలికపై అత్యాచారం.. తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తుండగా ఎత్తుకెళ్లి..

Brother Raped Minor Sister in Maharashtra : చెల్లిపై అత్యాచారానికి పాల్పడిన అన్న.. గర్భం దాల్చిన బాలిక.. ఆఖరికి..

Last Updated : Sep 17, 2023, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.