ETV Bharat / bharat

తొమ్మిదో తరగతి విద్యార్థినిపై క్లాస్​మేట్​ సోదరుడు అత్యాచారం - అత్యాచారం కేసులు

తొమ్మిదోతరగతి విద్యార్థినిపై(rape victim) ఓ కిరాతుకుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది. కాగా బరేలీ జిల్లాలో ​అత్యాచారానికి సంబంధించి మదర్సా ఉపాధ్యాయుడిపై కేసు నమోదైంది.

raped in UP
అత్యాచారం
author img

By

Published : Oct 11, 2021, 1:22 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగుచూసింది. ముజఫర్​నగర్​ జిల్లాలోని ఓ గ్రామంలో తొమ్మిదోతరగతి విద్యార్థినిపై(rape victim) తన సహవిద్యార్థిని సోదరుడే అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇదీ జరిగింది

బాధితురాలు.. గ్రామంలోని తన సహవిద్యార్థిని ఇంటికి ఆదివారం వెళ్లింది. అక్కడే నిందితుడు అత్యాచారానికి పాల్పడి.. ఆ దృశ్యాలను రికార్డు చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇంటికి చేరుకున్న తర్వాత తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని చెప్పింది ఆ బాలిక. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

మరో ఘటన

బరేలీ జిల్లాలో ఓ మదర్సా ఉపాధ్యాయుడిపై అత్యాచారం కేసు నమోదైంది. బాధితురాలు ఫిర్యాదు ప్రకారం.. "ఆమె నాలుగేళ్ల క్రితం మదర్సాకు వెళ్లింది. అక్కడే ఆమెతో కలిసి ఓ యువకుడు కూడా చదువుకునేవాడు. తర్వాత అతను మదర్సాలో బోధించడం మొదలు పెట్టాడు. కొంత కాలం తర్వాత వీరిద్దరు ప్రేమలో పడ్డారు. దీంతో పెళ్లి చేసుకుంటానని చెప్పి నిందితుడు పదేపదే అత్యాచారం చేశాడు. ఫలితంగా గర్భం దాల్చగా.. అబార్షన్​ చేసుకోవాలి ఒత్తిడి చేశాడు. ఒకసారి నిందితుడి ఇంటికి బాధితురాలు వెళ్లగా.. అక్కడ నుంచి వెళ్లిపోవాలని లేకపోతే చంపుతానని బెదిరించాడు."

ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Rape: నమ్మి వెంట వెళ్లిన యువకుడిపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.