ETV Bharat / bharat

'త్వరలో హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు.. అదే ప్రధాన లక్ష్యం' - హైకోర్టు చీఫ్​ జస్టిస్​

CJI NV Ramana: దేశంలోని హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి పేర్లు సూచించాలని సంబంధిత కోర్టు ప్రధాన న్యాయమూర్తులను కోరారు సీజేఐ జస్టిస్​ రమణ. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సు సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో సంస్థాగత, చట్టపరమైన సంస్కరణలు అమలుకు శ్రీకారం చుట్టడంపై చర్చించారు.

CJI NV Ramana
సీజేఐ ఎన్​వీ రమణ
author img

By

Published : Apr 29, 2022, 3:20 PM IST

CJI NV Ramana: దేశంలోని వివిధ హైకోర్టుల్లో జడ్జీల నియామకానికి పేర్లను సూచించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ సంబంధిత హైకోర్టు చీఫ్​ జస్టిస్​లను కోరారు. ఖాళీలను భర్తీ చేయడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సమష్టి కృషితో వివిధ హైకోర్టులలోని 126 ఖాళీలను ఒక సంవత్సరం లోపు భర్తీ చేయగలిగామని.. త్వరలో మరో 50 నియామకాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

జస్టిస్ ఎన్​వీ రమణ అధ్యక్షతన సుప్రీంకోర్టు ఆవరణలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సు నిర్వహించారు. ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ సదస్సు జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్‌ సహా అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హజరయ్యారు.

ఈ సందర్భంగా న్యాయవ్యవస్థలో సంస్థాగత, చట్టపరమైన సంస్కరణలు అమలుకు శ్రీకారం చుట్టడంపై చర్చించారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం తదుపరి చేపట్టాల్సిన చర్యలు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలు, పదవీ విరమణ తర్వాత ప్రయోజనాలను పెంచడం వంటి అంశాలపై సమాలోచనలు జరిపారు. ఏడాది కాలంలో సుప్రీంకోర్టుకు 9 మంది కొత్త జడ్జీలు, హైకోర్టులకు 10 మంది సీజేలు వచ్చారని జస్టిస్ ఎన్​వీ రమణ అన్నారు. ఇందుకు సహకరించిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి : క్యాబ్​ డ్రైవర్​ను హత్యచేసిన మైనర్లు.. 32సార్లు కత్తితో పొడిచి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.