ETV Bharat / bharat

'న్యాయవాద వృత్తికి వారు అందించిన సేవలు మరువలేనివి' - సీజేఐ ఎన్‌.వి రమణ న్యూస్

ముగ్గురు మాజీ హైకోర్టు ప్రముఖ న్యాయవాదులకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్‌.వి రమణ శుక్రవారం నివాళులర్పించారు. న్యాయవాద వృత్తికి వారు విశేష సేవలందించారని.. వారి మరణం ఈ రంగానికి తీరని లోటు అని అన్నారు.

CJI N V Ramana
సీజేఐ రమణ
author img

By

Published : Dec 18, 2021, 7:19 AM IST

సుప్రీంకోర్టు దివంగత సీనియర్‌ న్యాయవాదులు భీమ్‌రావు ఎన్‌.నాయక్‌, నాగేంద్ర రాయ్‌, ప్రభాత్‌ చంద్ర అగర్వాల్‌లకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఘనంగా నివాళులు అర్పించారు. న్యాయవాద వృత్తికి వీరు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఈ ముగ్గురూ వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా పనిచేసిన తర్వాత మళ్లీ న్యాయవాదులుగా వృత్తి ధర్మాన్ని కొనసాగించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మాట్లాడారు.

"బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన భీమ్‌రావు ఎన్‌.నాయక్‌ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. షోలాపూర్‌ జిల్లా సెషన్స్‌ కోర్టులో న్యాయవాద ప్రస్థానం ప్రారంభించిన ఆయన సుప్రీంకోర్టు వరకూ దాన్ని కొనసాగించారు. పట్నా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన నాగేంద్ర రాయ్‌... పదవీ విరమణ అనంతరం సీనియర్‌ న్యాయవాదిగా కొనసాగారు. విభిన్న రంగాలకు చెందిన పలు కేసుల్లో ఆయన తనదైన వాదనలు వినిపించారు. భారత్‌-పాకిస్థాన్‌ సంయుక్త న్యాయ సంఘానికి కూడా రాయ్‌ ఎంపికయ్యారు. ప్రభాత్‌ చంద్ర అగర్వాల్‌.. మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందిన అనంతరం సీనియర్‌ న్యాయవాదిగా కొనసాగారు. కీలకమైన భిలాయ్‌ ఫైరింగ్‌, ముల్తాయ్‌ ఫైరింగ్‌ కమిషన్లకు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. క్రిమినల్‌ లాపై ఉన్న అపారమైన పట్టుతో సుప్రీంకోర్టులో మంచి న్యాయవాదిగా గుర్తింపు పొందారు. వీరి మరణం యావత్‌ న్యాయ సమాజానికి తీరని లోటు. సోదర, సోదరీ న్యాయమూర్తులతో కలిసి దివంగత మాజీ న్యాయమూర్తుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. కోలుకోలేని నష్టాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా"

---జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్‌ కె.కె. వేణుగోపాల్‌, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వికాస్‌ సింగ్‌, సుప్రీంకోర్టు అడ్వొకేట్స్‌ ఆన్‌ రికార్డ్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ శివాజీ ఎం.జాదవ్‌, సీనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.