ETV Bharat / bharat

వలంటీర్​ అరాచకం- చోరీ ఆరోపణతో యువకుడిపై కిరాతకంగా దాడి - దొంగను పోలీసు కొట్టిన వైరల్​ వీడియో

దొంగతనం ఆరోపణతో ఓ యువకుడిని నడిరోడ్డిపై చితకబాదాడు ఓ పోలీసు వలంటీర్​. కోల్​కతా నగరంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్​గా మారాయి. దీంతో పోలీసు వలంటీర్​ను సస్పెండ్​ చేశారు అధికారులు.

Civic volunteer in Kolkata brutally thrashes snatcher,
దొంగను చితకబాదిన పోలీసు వలంటీర్​
author img

By

Published : Nov 8, 2021, 1:55 PM IST

అనుమానితుడిని కొడుతున్న పోలీసు వలంటీర్​

బంగాల్​ రాజధాని కోల్​కతాలో అమానుష ఘటన వెలుగుచూసింది. బస్సులో చోరీకి పాల్పడాడనే ఆరోపణతో అనుమానితుడిని దారుణంగా కొట్టాడు ఓ సిటీ పోలీసు వలంటీరు. దక్షిణ మధ్య కోల్‌కతాలో ఆదివారం సాయంత్రం జరిగిందీ ఘటన.

ఇదీ జరిగింది

బస్సులో తన బ్యాగును ఓ వ్యక్తి దొంగిలించడానికి యత్నించాడని ఓ మహిళ ఆరోపించింది. దీంతో స్థానికులు.. అతనిని పట్టుకుని చితకబాదారు. అయితే సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు వలంటీర్​ తన్మయ్​ బిశ్వాస్​.. ఆ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని మరింత దారుణంగా కొట్టాడు. కాలుతో ఛాతీపై తన్నాడు. అనంతరం దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. దీంతో నెటిజన్లు ఆ పోలీసు వలంటీర్​పై విమర్శలు గుప్పించారు. 2020లో అమెరికాలో ఓ పోలీసు అధికారి.. ఆఫ్రికన్​ సంతతి వ్యక్తి అయిన జార్జ్ ఫ్లాయిడ్​పై చేసిన జాత్యహంకార దాడిని గుర్తు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Police Volunteer brutally thrashes snatcher
అనుమానితుడిని కొడుతున్న పోలీసు వలంటీర్​

ఈ పరిణామాల అనంతరం సిటీ పోలీస్​ కమిషనర్​ సోమెన్​ మిత్రా.. ఈ ఘటనపై క్షమాపణలు చెప్పి, దిగ్భ్రాంతికి గురైనట్లు పేర్కొన్నారు. బిశ్వాస్​ను సస్పెండ్​ చేశామని.. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

నేనే రక్షించాను.. కానీ..

అయితే అనుమానితుడిని కొట్టడానికి కొన్ని కారణాలున్నాయని సమర్థించుకున్నాడు బిశ్వాస్. "అనుమానితుడిని స్థానికులు కొడుతుంటే.. వారి నుంచి నేనే రక్షించాను. కానీ అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. అతనిని అదుపులోకి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది" అని బిశ్వాస్​ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: టవల్​ ఆలస్యంగా ఇచ్చిందని భార్యను దారుణంగా చంపిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.