ETV Bharat / bharat

నారాయణపేట జిల్లాలో విషాదం.. చెరువులో దిగి ముగ్గురు చిన్నారులు, తల్లి మృతి - Narayanapet Crime News

Children die
Children die
author img

By

Published : Apr 18, 2023, 8:06 PM IST

Updated : Apr 18, 2023, 10:28 PM IST

20:03 April 18

నారాయణపేట జిల్లాలో విషాదం.. చెరువులో దిగి ముగ్గురు చిన్నారులు, తల్లి మృతి

Mother and sons died in Narayanapet: నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. జిల్లాలోని బోయిన్‌పల్లిలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు వారిని కాపాడానికి వెళ్లిన ఓ బాలుని తల్లి మృతి చెందారు. మొదట ఈత కోసమని చెరువులోకి దిగిన ముగ్గురు పిల్లలు నీటిలో మునిగిపోతుండగా.. వారిని రక్షించేందుకు వెళ్లిన ఓ బాలుని తల్లి సైతం అదే చెరువులో మునిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల కథనం.. ప్రకారం బోయినిపల్లి గ్రామానికి చెందిన సురేఖ.. అమె కుమారుడు విజయ్, అక్క కూతురు లిఖిత, మరో బాలుడు వెంకటేశ్‌ను వెంటబెట్టుకుని మేకలు కాయడానికి గ్రామ శివారులోని పెద్ద చెరువు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో సరదాగా ఈత కొట్టేందుకు ముగ్గురు పిల్లలూ చెరువులోకి దిగారు. చెరువు లోతు ఎక్కువగా ఉండటంతో వారు నీటిలో మునిగిపోయారు. ఇది గమనించిన సురేఖ వారిని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నం చేసింది. చివరికి చిన్నారులను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు తాను కూడా నీటిలో దిగింది. ఆమెకు ఈత రాకపోవడంతో మృతి చెందింది.

ఇదంతా అక్కడే ఉన్న ఉన్న మమత అనే బాలికి చూసి జరిగిన ఘటన ఊళ్లోకి పరుగెత్తుకుంటూ వెళ్లి చెప్పింది. గ్రామస్థులు హుటాహుటిన చెరువు వద్దకు పరుగెత్తుకు రాగా.. అప్పటికే నలుగురు చెరువులో మునిగి పోయారు. పోలీసుల సహాయంతో చెరువులో గాలించిన గ్రామస్థులు మృతదేహాలను వెలికితీశారు. గ్రామానికి చెందిన నలుగురు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పిల్లలంతా పదేళ్లలోపు వాళ్లు కాగా.. సురేఖకు 28 సంవత్సరాలు.

"నా పేరు మమత నేను, మా పిన్ని, మా ఫ్రైండ్స్‌ మేకలు కాయడానికి చెరువు దగ్గరికి వెళ్లాం.. ఇంతలో విజయ్‌, లిఖిత, వెంకటేశ్‌ ఈతకు అని చెరువులో దిగారు. ఇంతలో వారు చెరువులో మునిగిపోయారు. వారిని కాపాడడానికి మా పిన్ని కూడా చెరువులో దిగింది. అందరూ మునిగిపోయారు. వెంటనే నేను భయపడి జరిగిన విషయం మా ఊళ్లోకి వచ్చి చెప్పాను. అందరం కలిసి వెళ్లి చూసే సరికి వారు చనిపోయారు."- మమత, ప్రత్యక్ష సాక్షి

ఇవీ చదవండి:

వెంటాడిన మృత్యువు.. గాయం నుంచి కోలుకున్నా.. కోతుల రూపంలో..!

అమ్మా.. నన్ను ఎందుకు అమ్మేశావ్.. నేనేం తప్పు చేశాను..?

'మరణంలోనూ.. నేనున్నానని.. నీతో వస్తానని'.. భద్రాద్రి దంపతుల హార్ట్ ​టచింగ్ స్టోరీ

Last Updated : Apr 18, 2023, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.