ETV Bharat / bharat

అమ్మకు కల.. సమాధి నుంచి చిన్నారి మృతదేహం తీసి పూజలు.. చివరకు..

తాంత్రికుడు చెప్పాడని సమాధిలో నుంచి మూడేళ్ల చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు కుటుంబసభ్యులు. ఇంట్లో పూజలు చేశారు. ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో జరిగిందీ ఘటన.

child was taken out of grave and admitted in hospital
సమాధి నుంచి చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసిన తల్లిదండ్రులు
author img

By

Published : Jan 18, 2023, 4:28 PM IST

Updated : Jan 18, 2023, 6:45 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలో ఒక విచిత్రమైన ఘటన జరిగింది. మూడేళ్ల చిన్నారి అనారోగ్య సమస్యల వల్ల మృతి చెందిందని డాక్టర్లు చెప్పగా.. ఆ బాబు కుటుంబం అతడికి అంత్యక్రియలు నిర్వహించి సమాధిలో పాతి పెట్టారు. ఇంత వరకు బాగానే ఉంది. చిన్నారి తల్లికి బాబు బతికే ఉన్నాడనే కల వచ్చింది. దీంతో ఒక తాంత్రికుడి దగ్గరకు వెళ్లారు. అతడి మాటలు విని పూడ్చిపెట్టిన చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు.

పోలీసు వివరాల ప్రకారం:
ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలోని సైద్‌పుర్ మహరి గ్రామంలో అక్షత్(3) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శనివారం సాయంత్రం బాలుడు మరణించాడు. కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వెనక బాలుడిని పూడ్చి పెట్టారు. ఇంత వరకు సజావుగానే సాగిన ప్రక్రియ చిన్నారి తల్లి పూజకు వచ్చిన కలతో మలుపు తిరిగింది.

బాలుడిని పూడ్చిపెట్టాక సోమవారం రాత్రి తల్లి పూజకు తన బిడ్డ బతికే ఉన్నట్లు కల వచ్చింది. దీంతో తనకు వచ్చిన కల గురించి తన భర్త సునీల్​కు చెప్పగా.. అతడు ఒక తాంత్రికుడి దగ్గరకు వెళ్లాడు. తన భార్యకు వచ్చిన కల గురించి చెప్పాడు. ఆ తాంత్రికుడు అదునుగా దొరికిందని ఆ బాలుడు బతికే ఉన్నాడని, సమాధి నుంచి బయటకు తీయమని చెప్పాడు. బయటకు తీసి మంత్రాలు చదివితే బాలుడు బతుకుతాడనే మూఢనమ్మకంతో బాలుడు తల్లిదండ్రలు, బంధువులు కలిసి తాంత్రికుడు చెప్పినట్లు చేశారు.

"బాలుడి తల్లిదండ్రులు, బంధువులు స్థానిక తాంత్రికుడితో మాట్లాడారు. తర్వాత అందరూ కలిసి సమాధి వద్దకు వెళ్లారు. తాంత్రికుడు బాలుడు సమాధిపై పూజలు చేశాడు. తర్వాత కుటుంబ సభ్యులు సమాధిని తవ్వి బాలుడిని బయటకు తీశారు. అనంతరం బాలడిని ఇంటికి తీసుకొచ్చి నేలపై పడుకోబెట్టి చిన్నారిని బతికించడం కోసం మంత్రాలు చదువుతుండగా పోలీసులకు సమాచారం ఇచ్చాము." అని స్థానికులు చెప్పారు.

"గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసు బృందంతో సైద్‌పుర్‌ మహరి గ్రామానికి చేరుకున్నాము. కుటుంబ సభ్యులు చిన్నారిని నేలపై పడుకోబెట్టారు. తాంత్రికుడు మంత్రాలు చదువుతున్నాడు. మమ్మల్ని చూడగానే తాంత్రికుడు పారిపోయాడు. అక్కడ ఉన్న వారిని విచారించగా చిన్నారి శరీరం వెచ్చగా ఉన్నట్లు చెప్పారు. వెంటనే చిన్నారి బాడీని ఆస్పత్రికి తరలించాము. మరిన్ని విషయాల కోసం దర్యాప్తు ప్రారంభించాము." అని స్టేషన్‌ ఇన్‌చార్జి దుబగ్గ సుఖ్‌బీర్‌ సింగ్‌ భదౌరియా తెలిపారు.

Last Updated : Jan 18, 2023, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.