ETV Bharat / bharat

కాటేసిన పాముపై రివేంజ్​.. సర్పాన్ని కరిచిన బాలుడు.. పిల్లాడు సేఫ్.. పాము మృతి - జష్​పుర్​ పాముని కరిచిన చిన్నారి

ఎక్కడైనా పాములు కరిస్తే మనుషులు చనిపోతారు. కానీ ఛత్తీస్​గఢ్​లో ఓ బాలుడు పాముని కరవగా ఆ పాము చనిపోయింది. తనని కాటేసిందనే కోపంతో ఆ బాలుడు అలా చేశాడు. ప్రస్తుతం ఆ బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడు.

child bites snake in jashpur
కాటేసిన పామునే కరిచిన చిన్నారి
author img

By

Published : Oct 30, 2022, 10:48 PM IST

ప్రతిరోజూ ఏదో ఒకచోట మనిషిని పాము కాటేసింది అనే వార్తను వింటూనే ఉంటాం. ఛత్తీస్​గఢ్​లోనూ ఓ పిల్లాడికి పాము కాటేసింది. ఇందులో ఏముంది అనుకుంటున్నారా? తనను కాటు వేసిందన్న కోపంతో ఆ పిల్లాడు తిరిగి పామును కరిచాడు. ఈ ఘటనలో బాలుడి దెబ్బకు పాము చనిపోగా.. ఆ అబ్బాయి మాత్రం ఆరోగ్యంగా ఉన్నాడు.

అసలు ఏం జరిగిందంటే.. జష్‌పుర్‌ జిల్లా గార్డెన్‌ డెవలప్‌మెంట్‌ బ్లాక్‌కు చెందిన పండారపథ్‌లోని కోర్వా తెగకు చెందిన దీపక్​ రామ్​ అనే 12 ఏళ్ల బాలుడిని పాము కాటేసింది. ఆ చిన్నారి ఆడుకుంటూ తన సోదరి ఇంటికి వెళ్తుండగా.. దీపక్​ చేతికి పాము కాటేసింది. దీంతో ఆగ్రహించిన దీపక్​.. పామును పట్టుకుని రెండు చోట్ల కరిచాడు. ఈ ఘటనలో పాము అక్కడికక్కడే చనిపోయింది. ఈ విషయం వెంటనే చిన్నారి తన కుటుంబ సభ్యులతో చెప్పగా.. దీపక్​ను ఆస్పత్రికు తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే జష్​పుర్​లో మనుషుల్ని పాము కరిస్తే వారు కూడా తిరిగి పామును కరవాలని.. అలా చేస్తే ఏ ప్రమాదం ఉండదని వారి నమ్మకం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.