Chhattisgarh Assembly Election 2023 Exit Poll : ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ హస్తం పార్టీదే విజయమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 90స్థానాలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో.. అధికార కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలవచ్చని వెల్లడించాయి. కాంగ్రెస్ 49 నుంచి 65 చోట్ల గెలిచి ఛత్తీస్‌గడ్‌లో తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందని టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. బీజేపీకి 25 నుంచి 41 స్థానాలు, ఇతరులు 3 చోట్ల విజయం సాధించవచ్చని పేర్కొంది.
ఛత్తీస్‌గఢ్‌లో వార్ వన్‌సైడ్- కాంగ్రెస్ జయకేతనం!
Axis Exit Poll for Chhattisgarh Assembly Elections 2023 predicts Congress : ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చాయి. ఈ సారి హస్తం పార్టీ 50 సీట్ల వరకు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాయి.
బీజేపీ మళ్లీ నిరాశే!
BJP Chhattisgarh Election Exit Poll Results 2023 : ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి మళ్లీ నిరాశే ఎదురైంది. హస్తం పార్టీవైపే ఛత్తీస్‌గఢ్ ప్రజలు మొగ్గచూపారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలిపాయి. ఈ సారి బీజేపీ 36 నుంచి 46 సీట్లు గెలిచే అవకాశలున్నట్లు పేర్కొన్నాయి.
ఎగ్జిట్ పోల్స్ సంస్థ అంచనాలు ఇలా..
- ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ 41 నుంచి 53 స్థానాలు గెలుస్తుందని తేలింది. భాజపాకు 36 నుంచి 48 స్థానాలు రావొచ్చని, ఇతరులు 4 చోట్ల గెలుస్తారని అంచనా వేసింది.
- జన్‌కీబాత్ అంచనా ప్రకారం ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ 42 నుంచి 53 స్థానాలు గెలుస్తుంది. బీజేపీ 34 నుంచి 45 స్థానాలు గెలిచే అవకాశముంది.
- ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ 4 నుంచి 50 స్థానాలు గెలవచ్చని యాక్సిస్ మైఇండియా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది.
సంస్థ | ఇండియా టీవీ సీఎన్ఎక్స్ | యాక్సిస్ మైఇండియా | టీవీ5 న్యూస్ | పీపుల్స్ పల్స్ | |
పార్టీ / సీట్లు | |||||
కాంగ్రెస్ | 46-56 | 40-50 | 54-66 | 54-64 | |
బీజేపీ | 30-40 | 36-46 | 29-39 | 29-39 | |
ఇతరులు | 3-5 | 1-5 | 0-2 | 0-2 |
రెండు విడతల్లో ఎన్నికలు..
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరిగిగాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా తొలి విడతలో 20 స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ నిర్వహించారు. మిగతా 70 నియోజకవర్గాలకు నవంబర్ 17న ఎన్నికలు నిర్వహించారు. తొలి విడతలో నక్సల్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికలు జరిగాయి.
గత ఎన్నికల ఫలితారు..
2018 ఎన్నికల్లో 68 స్థానాలు కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. బీజేపీ కేవలం 15 సీట్లతో సరిపెట్టుకుంది. ఇప్పుడు రెండో విడత పోలింగ్ జరుగుతున్న 70 స్థానాల్లో క్రితం సారి కాంగ్రెస్ 50చోట్ల గెలుపొందగా, బీజేపీ 13 సీట్లలో విజయం సాధించింది. జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ నాలుగు, బీఎస్పీ రెండు స్థానాల్లో గెలుపొందాయి.
రాజస్థాన్‌లో సెంటిమెంట్ రిపీట్- 'కమల' వికాసం- కాంగ్రెస్‌కు నిరాశ!
మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ- ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే?