ETV Bharat / bharat

Chandrababu speech in Mahanadu: కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం కావాలి.. సమర శంఖం పూరించిన చంద్రబాబు - మహానాడులో చంద్రబాబు

mahanadu 2023
శంఖం పూరించిన చంద్రబాబు
author img

By

Published : May 28, 2023, 7:51 PM IST

Updated : May 28, 2023, 10:41 PM IST

19:46 May 28

మనల్ని అడ్డుకున్న వారిని తొక్కుకుంటూ వెళ్తాం

chandrababu speech in mahanadu: రాజమండ్రిలో జరిగిన మహానాడులో చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. చిల్లర, చెత్త, పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడును చెడగొట్టేందుకు ఫ్లెక్సీలు కట్టారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ధరలు పెరిగి ప్రజలంతా నష్టపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇకపై తమను అడ్డుకున్న వారిని తొక్కుకుంటా వెళ్తామని చంద్రబాబు వెల్లడించారు. తెలుగుజాతి చరిత్ర తిరగరాసేందుకు ఈ మహానాడు కార్యక్రమం దోహదం చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు.

మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు: ఎన్టీఆర్‌.. సామాన్య కుటుంబంలో పుట్టి కష్టపడి ఎదిగారన్న చంద్రబాబు.. తెలుగువారి రుణం తీర్చుకునేందుకే ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. పాలనలో పేదవారి కోసం ఆలోచించిన నాయకుడు.. ఎన్టీఆర్‌ అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత.. ఎన్టీఆర్‌దే అంటూ చంద్రబాబు వెల్లడించారు. బడుగు, బలహీనవర్గాలను ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి తెచ్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ శతజయంతిని దేశ, విదేశాల్లో ఘనంగా నిర్వహించారని చంద్రబాబు వెల్లడించారు.

Kanna In Mahanadu: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది: కన్నా లక్ష్మీనారాయణ

రాజకీయ రౌడీలు ఖబడ్దార్‌ టీడీపీ కార్యకర్తలను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారన్న చంద్రబాబు.. రాజకీయ రౌడీలు ఖబడ్దార్‌.. జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అంకితభావం కలిగిన కార్యకర్తలు ఉండటమే టీడీపీ బలం అంటూ వెల్లడించారు.టీడీపీని దెబ్బతీద్దామని చూసి అనేకమంది విఫలమయ్యారని చంద్రబాబు గుర్తుచేశారు. తెలుగు దేశం మెుదట రూ.2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందన్న చంద్రబాబు.. తర్వాతే దేశంలో ఆహార భద్రత వచ్చిందని గుర్తు చేశారు. సంపద సృష్టించడం నేర్పిన పార్టీ తెలుగు దేశం పార్టీ అని వెల్లడించారు. ఒకేసారి రూ.50 వేలు రైతు రుణమాఫీ చేసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నాడు. ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చాంమన్న చంద్రబాబు.. ఇప్పుడు సమయానికి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశాడు.

4 Years Wonderkid: మహానాడులో బుడతడు.. గుక్కతిప్పుకోకుండా టీడీపీ పథకాల వివరాలు...

యువతకు జాబు రావాలంటే మళ్లీ బాబు రావాలి: పేదల పక్షపాతి.. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు వెల్లడించారు. తన వల్లే గతంలో అమరావతికి 29 వేలమంది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని చంద్రబాబు వెల్లడించారు. పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరానికీ నీళ్లు ఇద్దామని చూసినట్లు చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా... రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామన్న చంద్రబాబు.. నాలుగేళ్ల వైకాపా పాలనలో ఒక్కరికి సైతం ఉద్యోగం తీసుకురాలేకపోయిందన్నారు. యువతకు జాబు రావాలంటే మళ్లీ బాబు రావాలనే పరిస్థితు నెలకొన్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

ayyanna patrudu speech: 'మరోసారి జగన్ గెలిస్తే.. మన కిడ్నీలను సైతం అమ్మేస్తాడు'

Last Updated : May 28, 2023, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.