ETV Bharat / bharat

సుప్రీంలో చంద్రబాబు స్కిల్ క్వాష్​ పిటీషన్ - ఈ నెల 16 న వెలువడనున్న తీర్పు

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 5:53 PM IST

Updated : Jan 14, 2024, 9:09 AM IST

Chandrababu Quash Petition judgment in Supreme Court: అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-A కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నెల 16న తీర్పు ఇవ్వనుంది.

Chandrababu Quash Petition judgment
Chandrababu Quash Petition judgment

Chandrababu Quash Petition judgment in Supreme Court : అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-A కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలంటూ తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ నెల 16న తీర్పు ఇవ్వనుంది. ఈ కేసును జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించి అక్టోబరు 17న తీర్పు వాయిదా వేసింది.

Chandrababu Skill Development Case: ప్రవేశ ద్వారం వద్దే అవరోధం ఉన్నప్పుడు విచారణ ఎలా చేస్తారు.. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ ప్రశ్న

ఈ అంశంతో ముడిపడిన ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు దాఖలు చేసిన కేసు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు నాయుడుకు బెయిల్‌ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానున్నందున సుప్రీంకోర్టు వాటి కంటే ముందు 17-Aపై నిర్ణయాన్ని వెలువరించనుంది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ ఈ తీర్పును వెలువరించనున్నట్లు సమాచారం.

హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి, గతేడాది సెప్టెంబరు 22న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు అదే నెల 23న సుప్రీంకోర్టులో బాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశారు. దాన్ని త్వరగా విచారణకు స్వీకరించాలని అదేనెల 25న ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థలూథ్రా సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు. అప్పుడు సాధ్యం కాకపోవడంతో సీజేఐ దాన్ని మర్నాడు మెన్షన్‌ చేయాలని సూచించారు. ఆ రోజు రాజ్యాంగ ధర్మాసనం ఆసీనం అయ్యే అవకాశం లేక కేసును 27న జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్‌ల ధర్మాసనం ముందుకు వచ్చింది. దసరా, దీపావళి, శీతాకాల సెలవుల వల్ల తీర్పు వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు ఈనెల 16న వెలువడనుంది.

Chandrababu Quash Petition Hearing in SC: 17ఎ వర్తించేలా కనిపిస్తోంది.. స్కిల్‌ డెవలప్​మెంట్ కేసులో సుప్రీం వ్యాఖ్య

తొలుత ఈ కేసుపై సుప్రీంకోర్టు కంప్యూటర్‌ జనరేటెడ్‌ కేసుల లిస్టింగ్‌లో జనవరి 16వ తేదీన తీర్పు వెలువరించనున్నట్లు పేర్కొన్నారు. జనరల్‌గా సుప్రీంకోర్టులో కేసు విచారణ కానీ తీర్పు కానీ ఉంటే సంబంధిత కేసు వాదించే న్యాయవాదులకు దీనిపై రిజిస్టార్‌ నుంచి మెస్సేజ్‌ వస్తుంది. అలాంటి సమాచారం ఏదీ కూడా ఇరుపక్షాల న్యాయవాదులకు రాలేదనే వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ కేసు తీర్పు ఈ నెల 16న వెలువడనుందని కోర్టు వర్గాలు స్పష్టం చేశాయి.

Last Updated : Jan 14, 2024, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.