AP High Court Hear on Chandrababu Petition: అంగళ్లు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. తెలుగుదేశం అధినేత ముందస్తు బెయిల్ పిటిషన్లపై భోజన విరామం అనంతరం తిరిగి విచారణ ప్రారంభించిన హైకోర్టు.. అంగళ్లు కేసులో చంద్రబాబును రేపటి వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును సోమవారం వరకు అరెస్టు చేయవద్దని స్పష్టం చేసింది.
Lokesh CID Enquiry Questions: సీఐడీ విచారణకు లోకేశ్.. ప్రశ్నలు అడిగేందుకు అధికారుల తర్జనభర్జనలు..
అంగళ్లు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులు షెడ్యూల్ ప్రకారం ఉదయమే న్యాయమూర్తి ఎదుటకు రాగా.. హైకోర్టు విచారణ చేపట్టింది. అంగళ్లు కేసులో చంద్రబాబును అరెస్టు చేయాల్సి ఉంటుందని... అసలు ఆ ఘటన జరగడానికి ఆయన వ్యాఖ్యలే కారణమని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు. అమరావతి రింగ్ రోడ్డు కేసులోనూ చంద్రబాబును కస్టడీకి తీసుకొని విచారించాల్సి ఉంటుందన్నారు. అయితే చంద్రబాబు తరపు న్యాయవాదులు... ఆయన విచారణకు సహకరిస్తారన్నారు. మధ్యంతర ఉత్తర్వులు ద్వారా ఆయన్నుఅరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. దీంతో సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు స్పష్టం చేసింది. మధ్యాహ్నం పన్నెండున్నర గంటల తర్వాత హైకోర్టు తిరిగి ఈ కేసులు విచారణ చేపట్టింది. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్‌లో ఉందన్న అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్...ఈ దశలో చంద్రబాబుకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దన్నారు. చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం ఉందన్న ఆయన తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్… ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. అనంతరం కోర్టు విచారణ వాయిదా పడింది. భోజన విరామం అనంతరం విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.
రెండో రోజు కొనసాగుతున్న లోకేశ్ విచారణ: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. రెండో రోజూ సీఐడీ విచారణకు హాజరయ్యారు. చెప్పిన సమయానికి కన్నా 5నిమిషాలు ముందే ఆయన సిట్ కార్యాలయానికి వెళ్లారు. ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కూడా సీఐడీ విచారణకు హాజరయ్యారు. 10వ తేదీ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే లోకేశ్ ను విచారించాలని.. న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనితో నిన్న సీఐడీ అడిగిన దాదాపు 50ప్రశ్నలకు లోకేశ్ సూటిగా సమాధానం చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేకుండా ఎక్కువ ప్రశ్నలు హెరిటేజ్ గురించే సీఐడి ఆడిగిందని లోకేశ్ తెలిపారు. మిగిలిన ప్రశ్నలకూ నిన్నే సమాధానం చెప్తానన్నా సీఐడీ అంగీకరించలేదన్నారు. న్యాయవాదులతో సంప్రదింపుల కోసం దిల్లీ వెళ్లాల్సి ఉన్నందున ఆలస్యమైనా సరే మంగళవారమే మిగతా ప్రశ్నలు అడగాలని లోకేశ్ కోరినట్లు తెలిపారు. సీఐడీ అధికారులు మాత్రం.. న్యాయస్థానం ఆదేశాల మేరకు 5 గంటలకే విచారణ ముగిస్తున్నామన్నారు. తన అంగీకారంతోనే 5 గంటల తర్వాత విచారణ కొనసాగించామని.. కోర్టుకు తెలియజేయవచ్చని.. లోకేశ్ సీఐడీని కోరారు. ప్రశ్నలు సిద్ధం చేసుకోవాల్సి ఉన్నందున బుధవారం విచారిస్తామని దర్యాప్తు అధికారి చెప్పటంతో లోకేశ్ అందుకు అంగీకరించారు. నిన్న విచారణ ముగిశాక మళ్లీ 41A నోటీసు జారీ చేసి సీఐడీ నేడు కూడా విచారణకు పిలిచింది.