ETV Bharat / bharat

Chandrababu Illness In Jail: ఎండవేడిమి, ఉక్కపోతతో చంద్రబాబుకు అలర్జీ.. వైద్య పరీక్షలు - చంద్రబాబు వీడియోలు

Chandrababu Illness In Jail: రాజమహేంద్రవరం జైల్లో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు అలర్జీతో బాధపడుతున్నారు. తీవ్ర ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా ఆయన అలర్జీతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి జైలు అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో వైద్య బృందం జైలులోకి వెళ్లి చంద్రబాబును పరీక్షించింది.

Chandrababu Illness In Jail
Chandrababu Illness In Jail
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2023, 7:13 PM IST

Updated : Oct 13, 2023, 7:16 AM IST

Chandrababu Illness In Jail: ఎండవేడిమి, ఉక్కపోతతో చంద్రబాబుకు అలర్జీ.. వైద్య పరీక్షలు

Chandrababu Illness In Jail: స్కిల్ డెవలప్​మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ.. గత కొన్ని రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ఆరోగ్యంపై అటు కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ.. వైసీపీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు కూడా లేకుండా పొయింది. గతంలోనే జైల్లో తనకు డిహైడ్రేషన్ అయినట్లు చంద్రబాబు తెలిపినా.. జైలు అధికారులు ఎలాంటి చర్యలు చెపట్టలేదనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా.. రాజమండ్రిలో ఉన్న తీవ్ర ఎండల నేపథ్యంలో ఎండ వేడిమి, ఉక్కపోత వల్ల చంద్రబాబుకు అలర్జీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకూ.. చంద్రబాబు అధికారులతో ఈ విషయాన్ని తెలియజేశారు.

వెంటనే తేరుకున్న జైలు అధికారులు చంద్రబాబు వైద్యం కోసం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాస్పత్రికి సమాచారం అందించారు. ఆయనకు చికిత్స అందించేందుకూ... వైద్యులు రాజమహేంద్రవరంలోని జైలుకు వెళ్లి చంద్రబాబును పరిశీలించారు. జీజీహెచ్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జైలుకి వెళ్లి చంద్రబాబును పరీక్షించారు. 6 గంటల 30 నిమిషాలకు వారు బయటకు వచ్చారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నించగా వారు మాట్లాడేందుకు నిరాకరించారు.

చంద్రబాబు చేయి, ఛాతీ, గడ్డంపైనా దద్దుర్లు ఏర్పడినట్లు తెలిసింది. జైలు ఇంఛార్జ్‌ పర్యవేక్షకుడు రాజ్‌కుమార్‌ను వివరణ కోరగా.. చంద్రబాబుకు చర్మ సంబంధిత అలర్జీ రావడంతో వైద్య నిపుణులకు చూపించామన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యులు సూచించిన మందులు అందజేస్తామని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని ఆందోళన అవసరం లేదంటూ.. ఓ బులిటెన్‌ విడుదల చేశారు.

Lokesh meets Amit Shah: రాజకీయ కక్షతో పెట్టిన కేసులు.. నిజం వైపు ఉండాలని అమిత్‌షాను కోరా: లోకేశ్​

రాజమహేంద్రవరంలో కొద్దిరోజులుగా తీవ్రమైన వేడి, ఉక్కబోత వల్ల చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులు ఇటీవల తెలిపారు. ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి చంద్రబాబును మంగళవారం జైలులో కలిశారు. చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురైన విషయాన్ని వారే వెల్లడించారు. చంద్రబాబు నీరసంగా ఉన్నారని, ముఖం లాగేసినట్లు కనిపించారంటూ తన తల్లి చెప్పినట్లు లోకేశ్​ బుధవారం చెప్పారు.

చంద్రబాబు బాగా బరువు తగ్గినట్టు.. ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుర్తించారని పార్టీ వర్గాలు తెలిపాయి. బరువు తగ్గడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, డీహైడ్రేషన్ ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చునని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. మొదటి నుంచీ చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల వినతిని అధికారులు పట్టించుకోవటం లేదని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుకు జైల్లో వసతులు కల్పించకుండా శారీరకంగా ఇబ్బంది పెడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నారా భువనేశ్వరి ఆందోళన: చంద్రబాబు ఆరోగ్యంపై నారా భువనేశ్వరి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యంపై తమకు ఆందోళన ఉందని తెలిపారు. ప్రభుత్వం కక్ష సాధింపు వల్లే చంద్రబాబు జైలులో ఉన్నారని... జైలుకు పంపడంపై కార్యకర్తలు, ప్రజల్లో ఆవేదన ఉన్నట్లు తెలిపారు. గతంలో సైతం ఆయనకు ఇంటి నుంచి భోజనం, మందులు, తదితర అంశాలపై కోర్టుకు సైతం వెళ్లారు. చంద్రబాబు విడుదల కోసం ఎదురు చూస్తూ నారా భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు. తరచూ ఆయనతో ములాఖత్ అవుతూ ఆయన యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉన్నారు.

Pawan Kalyan, Lokesh, Balakrishna Meet in Rajamahendravaram: నేడు పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ బాలకృష్ణల భేటీ.. చంద్రబాబుతో ములాఖత్​

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై అమిత్​షా వద్ద ప్రస్తావించిన లోకేశ్: కేంద్ర హోమంత్రి అమిత్​షాను కలిసిన.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. చంద్రబాబు ఆరోగ్యంపై కేంద్రమంత్రితో చర్చించారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళనలో ఉన్నట్లు అమిత్​షాకు తెలిపారు. తన తల్లి తన తండ్రిని జైల్లో చూసి కన్నీరు పెట్టుకుందని.. తన ఆరోగ్యంపై చంద్రబాబు భువనేశ్వరితో చెప్పినట్లు... లోకేశ్ తెలిపారు.

Nara Bhuvaneshwari and Brahmani met Chandrababu: చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్​

Last Updated : Oct 13, 2023, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.