Chandigarh University Case : పంజాబ్‌లోని చండీగఢ్ ప్రైవేటు యూనివర్సిటీలో అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లీక్ కేసులో ఇద్దరు నిందితులను శిమ్లాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. సన్నీ మెహతా(23), రాంకజ్ వర్మ(31) అనే ఇద్దరు నిందితులను హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకుని.. అనంతరం వారిని పంజాబ్ పోలీసులకు అప్పగించారు.
చండీగఢ్ యూనివర్శిటీ విద్యార్థినిల ప్రైవేట్ వీడియోలు లీక్ చేసిన కేసులో అరెస్టైన నిందితురాలికి సన్నీ మెహతా ప్రియుడు. సన్నీ.. శిమ్లాలోని రోహ్రు నివాసి. అతడు బీఏ వరకు చదివాడు. ప్రస్తుతం తన సోదరుడితో కలిసి ఓ కేక్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. మరో నిందితుడు రాంకజ్ వర్మ.. శిమ్లాలోని థియోగ్ నివాసి. అతడు ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. 'పంజాబ్ పోలీసులకు మా సహకారం ఉంటుంది. విద్యార్థినిల ప్రైవేట్ వీడియోలు లీక్ కావడం దురదృష్టకరం. పంజాబ్ పోలీసులకు హిమాచల్ పోలీసులు పూర్తి సహకారం అందిస్తారు' అని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ వెల్లడించారు.
యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని తన ప్రైవేట్ వీడియోను తన ప్రియుడికి షేర్ చేసింది. వేరే విద్యార్థినిల ప్రైవేట్ వీడియోలను ఆమె తీసిందనడంలో నిజం లేదు. ఆ ఆరోపణలు నిరాధారమైనవి. 7 మంది అమ్మాయిలు యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడ్డారని వచ్చిన వార్తలన్నీ అవాస్తవం. వర్సిటీలో ఒక్క విద్యార్థిని కూడా ఆత్మహత్యకు పాల్పడలేదు.
--చండీగఢ్ యూనివర్సిటీ ప్రకటన
మరోవైపు చండీగఢ్ యూనివర్సిటీ విద్యార్థులు తమ నిరసనలను సోమవారం తెల్లవారుజామున విరమించారు. అధికారులు, పోలీసులు పారదర్శకంగా దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడం వల్ల ఆందోళనలు నిలిపివేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించింనందుకు ఇద్దరు వార్డెన్లను సస్పెండ్ చేశారు వర్సిటీ అధికారులు. ఈ నెల 24 వరకు తరగతులకు రద్దు చేశారు. అలాగే విద్యార్థుల డిమాండ్లు, సమస్యలను చక్కదిద్దేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: స్నేహితుడితో గుడికి వెళ్లిన మైనర్పై గ్యాంగ్ రేప్.. ప్రియురాల్ని హత్యచేసి పెరట్లోనే..