Chaat seller killed: రూ.10 బిల్లు విషయంలో తలెత్తిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. కుల్ఫీ డబ్బులు అడిగినందుకు అవినాశ్ గుప్తా(16) అనే దుకాణదారుడుని హత్య చేశాడు.. దినేశ్ అనే యువుకుడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్ సోన్‌భద్రలోని రాయ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అవినాశ్ తలపై ఇనుప రాడ్‌తో బలంగా కొట్టటం వల్ల తీవ్ర రక్తస్రావమై ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే: అవినాశ్ చాట్, కుల్ఫీ దుకాణాన్ని దోరియా గ్రామ సమీపంలో నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన దినేశ్.. అవినాశ్ షాపులో చాట్ తిన్నాడు. బిల్లు తరువాత ఇస్తానని చెప్పి వెళ్లిపోయాడు. మళ్లీ కాసేపటి తరువాత దినేశ్ అతని స్నేహితునితో కలిసి వచ్చి మళ్లీ చాట్ కావాలని అడడగా అవినాశ్ నిరాకరించి.. మొదట తిన్న చాట్ బిల్లును ఇవ్వమని డిమాండ్ చేశాడు. దీంతో వీరిద్దరి మద్య గొడవ జరుగుతుంది. అనంతరం తిరిగి గ్రామానికి వచ్చాక మళ్లీ అవినాశ్, దినేశ్ మధ్య వాగ్వాదం జరుగింది. దీంతో నిందితుడు దినేశ్.. అవినాశ్‌పై ఇనుప రాడ్‌తో దాడిచేశాడు.
అప్పు తీర్చేందుకు సాయం చేస్తానని: మహారాష్ట్రలో దారుణం జరిగింది. సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడిన 26 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్లు కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వారం రోజుల క్రితం 35 ఏళ్ల నిందితుడు కాంబ్లే.. బాధితురాలిని చెంబూర్‌లోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అప్పులు తీర్చడానికి సహాయం చేస్తానని బాధితురాలిని నమ్మించాడు. అత్యాచారం తరువాత నిందితురాలికి ఫోన్ చేయడం మానేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: సవతి తల్లి చిత్రహింసలు.. అన్నం పెట్టమని అడిగిన చిన్నారి చేతులు కాల్చి..