ETV Bharat / bharat

'టీకా రెండు డోసులే... మళ్లీమళ్లీ కుదరదు'

పూర్తి వ్యాక్సినేషన్ చేయించుకున్నవారు మరోసారి టీకా పొందేందుకు అనుమతి లేదని కేంద్రం తెలిపింది. కేరళ హైకోర్టులో ఓ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ మేరకు స్పష్టంచేసింది.

re-vaccination
కరోనా టీకా
author img

By

Published : Aug 17, 2021, 5:23 PM IST

పూర్తి టీకా(2 డోసులు) పొందినవారు మరోసారి వ్యాక్సిన్ తీసుకునేందుకు అనుమతి లేదని కేరళ హైకోర్టుకు స్పష్టంచేసింది కేంద్ర ప్రభుత్వం. కన్నూర్​కు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ సందర్భంగా ఈ మేరకు తెలిపింది.

అప్పటికే కొవాగ్జిన్ రెండు డోసులు పొందిన పిటిషనర్​.. కొవిషీల్డ్​ తీసుకోవడానికి అనుమతి కోరారు. తాను పనిచేసే సౌదీ అరేబియాలో కొవాగ్జిన్​ను గుర్తించలేదని, ఫలితంగా ఆ దేశానికి వెళ్లేందుకు తనకు అనుమతి లభించడం లేదని ఆయన వివరించారు. అయితే... అందుకు అవకాశం లేదని హైకోర్టుకు స్పష్టంచేసింది కేంద్రం.

ఇదీ చూడండి: ఒకే ఒక్క కేసు వచ్చిందని దేశమంతా లాక్​డౌన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.